Kavitha in Delhi: జంతర్ మంతర్ వద్ద కవిత నిరాహార దీక్ష.. ఎప్పుడు, ఎందుకు?
Bharat Jagruthi Chief Kavitha will Protest in Jantar Mantar in Delhi against Modi Government
మోడీ సర్కార్ పై బీఆర్ఎస్ సమర శంఖం పూరించింది. ఆ పార్టీ మహిళా నేత, సీఎం కుమార్తె కవిత ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారు. మార్చి 10వ తేదీన జంతర్ మంతర్ వద్ద భారత జాగృతి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచనున్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును వెంటనే ఆమోదించాలని, జనగనన చేపట్టాలని కోరుతూ దీక్షకు దిగనున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్టు చేసినట్లే కల్వకుంట్ల కవితను కూడా సీబీఐ అధికారులు అరెస్టు చేస్తారని ఇటీవలే బీజేపీ నేతలు పలు చోట్ల ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కవిత నేరుగా ఢిల్లీలోనే కేంద్రంపై సమరానికి దిగుతున్నారు.
దర్యాప్తు సంస్థలు ఎవరిని ఎప్పుడు అరెస్టు చేస్తాయో బీజేపీ నేతలు ముందుగానే చెప్పడం చూస్తుంటే…దర్యాప్తు సంస్థలతో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందనే విషయం స్పష్టంగా అర్ధమౌతోందని కవిత అన్నారు. అదానీపై ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు జరగడం లేదని కవిత ప్రశ్నించారు.
On March 10, the Bharat Jagruti Foundation will host an all-party demonstration in Jantar Mantar in New Delhi. Along with other opposition parties, it's founder K #Kavitha, who is also a #BRS MLC, will advocate for the women's reservation bill.
— Mohd Lateef Babla (@lateefbabla) March 2, 2023
.