Bharat Gaurav Train: భారత్ గౌరవ్ ట్రైన్… ఈ నెల 18 నుండి
Bharat Gaurav Train: దేశంలో ఇప్పటికే కొన్ని రకాల ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ నడుపుతున్నది. విహార యాత్రలకోసం కొన్ని రైళ్లు, ఆధ్యాత్మిక యాత్రలకు కొన్ని రకాల రైళ్లు నడుపుతున్నది. ఈ కోవలోనే దక్షిణ మధ్య రైల్వేజోన్ నుండి భారత్ గౌరవ్ పేరుతో ఓ రైలును ఈనెల 18వ తేదీ నుండి నడపనున్నారు. పూరీ, కాశీ, అయోధ్య ప్రాంతాలను సందర్శించే పర్యాటకుల కోసం, ఆలయాలను సందర్శించే భక్తుల కోసం ఈ భారత్ గౌరవ్ పేరుతో రైలును నడుపుతున్నారు. ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీతో ఈ రైలును నడుపుతున్నది.
మార్చి 18 నుండి 26 వరకు, అదేవిధంగా ఏప్రిల్ 18 నుండి ఏప్రిల్ 25 వరకు ఈ ప్రత్యేక రైలు నడవనున్నది. మొత్తం 700 సీట్లున్న ఈ రైలు పూరి, కోణార్క్, గయ, కాశీ, అయోధ్య, హనుమాన్ గర్హి, ప్రయాగ్‌రాజ్ లోని వివిధ ప్రాంతాలను సందర్శించేలా, దేవాలయాలను దర్శించుకునేలా దక్షిణమధ్య రైల్వే ప్యాకేజీని తీసుకొచ్చింది. 700 సీట్లున్న ఈ రైలులో 460 స్లీపర్ సీట్లు, త్రీటైర్ ఏసీ సీట్లు 192, టూ టైర్ సీట్లు 48 ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ టికెట్ ధర ఒక్కొక్కరికి రూ. 15,300కాగా, థర్డ్ ఏసీలో రూ. 24,085, సెకండ్ ఏసీలో రూ. 31,500 గా ఉంటుంది.