Munugode: నేడే మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్ జరగనున్న నేపధ్యంలో బెట్టింగ్ రాయుళ్లు ముందుగానే చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో తిష్టవేశారని పోలీసులు నిర్ధారించారు. ముందుగా పోలింగ్ పర్సంటేజ్ ఎంత నమోదు కానుంది..? ఎవరికి అనుకూలంగా ఉంటుందనే అంశాలపై కూడా బెట్టింగ్ నడుస్తోందని తెలుస్తోంది. భారీ స్థాయిలో బెట్టింగ్‌లు కాయడానికి వచ్చిన బుకీలు చాపకింద నీరులా మునుగోడులో తమ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని పందాలు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇక డబ్బు లావాదేవీలను కూడా పోలీసులు రైడ్ చేసి పట్టుకునే అవకాశముండటంతో ఆన్ లైన్ ద్వారా యూపీఐ పేమెంట్స్ ,గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ద్వారా ట్రాన్సాక్షన్‌లు ఫాలో అవుతున్నారు. ఇక మునుగోడు లో మేమంటే మేమె గెలుస్తామని ధీమా తో ఉన్నారు అభ్యర్థులు.
మునుగోడు నియోజకవర్గానికి ఉపఎన్నిక అయినప్పటికి…ఫలితం కోసం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరకు ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణకు దగరలో ఉన్న ఒక జిల్లాలో మునుగోడు ఫలితాలపై కోట్ల రూపాయల్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. నేడు పోలింగ్ ముగిసాక ఫలితాలకు మరో రెండు రోజులు టైమ్ ఉండటంతో పోలీసులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే పాతిక లక్షల వరకు హవాలా డబ్బులు పట్టుకున్నారు పోలీసులు.