ఉద్దేశపూర్వకంగా వచ్చిందా.. లేదా కిడ్నాప్ చేశారా అన్నది తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు
Bengal Women kidnap Mistery : హైదరాబాద్ (HYderabad)లో బెంగాల్ (Bengal)యువతి కిడ్నాప్ (Kidnap)మిస్టరీ (Mystery)ని పోలీసు (Police)లు ఛేదించారు. మూడు నెలల క్రితం బెంగాల్లో కిడ్నాపైన ఆ యువతి హైదరాబాద్ శివార్లలో ప్రత్యక్షం కావటం ఆసక్తి రేపింది. ఫిబ్రవరి 25న ట్యూషన్‌కి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ యువతి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాలు, తెలిసిన బంధువులు, స్నేహితులు ఇళ్లలో వెతికినా కూడా ఆచూకీ దొరకలేదు. ఎంత వెతికినా లాభం లేకపోవటంతో.. తన కూతురు కనిపించటం లేదంటూ అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. తన అమ్మాయి కిడ్నాప్‌కు గురైందన్న అనుమానాన్ని ఆ తండ్రి వ్యక్తం చేయటంతో.. హేమతాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అమ్మాయిఆచూకీ కోసం గాలించారు. అయితే.. ఇన్ని రోజులు వెతికినా ఎక్కడా ఆ అమ్మాయి ఆచూకీ దొరకకపోవటంతో.. పక్క రాష్ట్రాల(States) పోలీసులకు కూడా అమ్మాయి వివరాలు పంపించారు. దీంతో.. హైదరాబాద్‌లోని నార్సింగ్ (Narsing)పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మాయి ఉన్నట్టు గుర్తించారు. ఉమెన్స్ సేఫ్టీ అడిషనల్ డీజీ షికా గోయల్ నేతృత్వంలో పోలీసులు.. యువతిని ఓ ఇంట్లో ఉండగా రెస్క్యూ చేసి కాపాడారు.
ఇన్ని రోజులూ ఎక్కడ ఉంది?
అన్సారీ అనే యువకుడు ఆమెను కిడ్నాప్ చేసి తీసుకొచ్చినట్టు అనుమానిస్తూ… బాధిత యువతిని.. నార్సింగి పోలీసులు వెస్ట్ బెంగాల్ పోలీసులకు అప్పగించారు. అయితే.. అన్సారీ అనే వ్యక్తి ఎవరన్నది తేలాల్సి ఉందని చెబుతున్నారు. అన్సారీతో కలసి ఉద్దేశపూర్వకంగానే వచ్చిందా లేక కిడ్నాప్ చేశాడా అన్న సమాచారం సేకరిస్తున్నారు. అయితే యువతి తల్లిదండ్రులు మాత్రం ఆమెను బలవంతంగా తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు