BBC Documentary Tension in HCU: హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో బీబీసీ డాక్యుమెంటరీ వివాదం
BBC Documentary Tension in HCU: బ్రిటీష్ బ్రాడ్ క్యాస్టింగ్ సంస్థ బీబీసీ ప్రధాని మోడీ, గుజరాత్ గోద్రా అల్లర్లపై మరోసారి డాక్యుమెంటరీని రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు వివాదంగా మారింది. బ్రిటన్ ప్రధాని సైతం ఈ డాక్యుమెంటరీని విమర్శించారు. బ్రిటన్ ఎంపీలు కూడా ఈ డాక్యుమెంటరీపై విమర్శలు చేస్తున్నారు. ఇక ఇండియా దీనిని బ్యాన్ చేసింది. కాగా, ఈ డాక్యుమెంటరీ కోసం హెచ్‌సీయులో స్క్రీన్‌షోను ఏర్పాటు చేయడం వివాదానికి దారి తీసింది. హెచ్‌సీయులో ప్రాటర్నిటీ గ్రూప్స్ అయిన స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్, ముస్లీం స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి సంఘాలు మిగతా సంఘాల అనుమతులు తీసుకోకుండా స్క్రీన్‌షోను ఏర్పాటు చేశాయి.
ఈ షోపై ఏబీవీపీ సంఘాలు మండిపడుతున్నాయి. మిగతా సంఘాల అనుమతులు లేకుండా స్క్రీన్ షోను ఎలా ఏర్పాటు చేస్తాయని మండిపడుతున్నాయి. డాక్యుమెంటరీని భారత ప్రభుత్వం బ్యాన్ చేసిందని, అయినప్పటికీ ఎలా హెచ్‌సీయులో ఎలా ప్రదర్శిస్తారని మండిపడుతున్నారు. 2002లో గోద్రాలో జరిగిన అల్లర్లకు సంబంధించి ఎన్‌క్వైరీతో పాటు సుప్రీంకోర్టు కూడా క్లీన్‌చీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ అల్లర్ల తరువాత గుజరాత్‌లో ఎలాంటి గొడవలు చోటు చేసుకోలేరు. అంతేకాదు, గుజరాత్ అభివృద్ధిపైనే అప్పటి ముఖ్యమంత్రి, నేటి ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి సారించారు. గుజరాత్ మోడల్ తోనే మోడీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రధానిగా విజయం సాధించారు. ప్రపంచంలో శక్తివంతమైన నాయకుల్లో ఒకరిగా ప్రధాని మోడీ గుర్తించబడ్డారు.