Bank Holidays in March: మార్చిలో సగం రోజులు బ్యాంకులు బంద్
Bank Holidays in March: నేటితో ఫిబ్రవరి నెల ముగియనున్నది. మార్చి నెల మొదటి తేదీ నుండే వినియోగదారులు బ్యాంకులకు వెళ్లి లావాదేవీలు నిర్వహిస్తుంటారు. అయితే, డిజిటల్ బ్యాంకింగ్ అందుబాటులోకి రావడంతో చాలా వరకు లావాదేవీలను డిజిటల్ రూపంలో నిర్వహిస్తున్నా, కొంతమంది ఇప్పటికీ బ్యాంకులకు వెళ్లి లావాదేవీలు నిర్వహిస్తున్నారు. అయితే, ప్రతి నెలా కొన్ని రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. కాబట్టి, ఏ రోజు బ్యాంకులకు సెలవులు ఉన్నాయో, ఏ రోజు బ్యాంకులు తెరిచి ఉంటాయో తెలుసుకొని వెళ్లడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం, మార్చి నెలలో మొత్తం 12 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి.
మార్చి నెలలో మొత్తం నాలుగు ఆదివారాలు, రెండు రెండో శనివారాలు వస్తున్నాయి. దీంతో ఆరు రోజులపాటు జనరల్ పబ్లిక్ హాలిడేలు వస్తుండగా, మార్చి 9 వ తేదీన హోలీ, మార్చి 22 వ తేదీన ఉగాది, మార్చి 30 వ తేదీన శ్రీరామనవమి పండుగల కారణంగా బ్యాంకులు మూతపడనున్నాయి. హోలీ, వేడుకలను వివిధ రాష్ట్రాల్లో వివిధ తేదీల్లో జరుపుకోవడంతో ఆయా తేదీలను అనుసరించి బ్యాంకులు మూతపడనున్నాయి. మొత్తంమీద దేశంలో 12 రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనుండటంతో వినియోగదారులు తేదీలను చూసుకొని బ్యాంకులకు వెళ్లాలని సూచిస్తున్నారు.