Bandi Sanjay on TS Govt: గవర్నర్ వ్యవస్థను అప్రతిష్టపాలు చేస్తున్నారు… సుప్రీంకోర్టుకు వెళ్లడం సిగ్గుచేటు
Bandi Sanjay on TS Govt: రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ విషయంలో సుప్రీకోర్టులో కేసులు దాఖలు చేసింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదని చెప్పి ప్రభుత్వం సుప్రీంకోర్టులు కేసులను దాఖలు చేసింది. దీనిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర గవర్నర్ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లడం సిగ్గుచేటని అన్నారు. గవర్నర్ వ్యవస్థను దెబ్బతీసేందుకు సీఎం కంకణం కట్టుకున్నారని, గతంలో ఇలానే హైకోర్టుకు వెళ్లగా అక్కడ ఎలాంటి తీర్పు వచ్చిందో గుర్తు చేసుకోవాలని అన్నారు.
ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లినా అదే పరిస్థితి వస్తుందని జోష్యం చెప్పారు. సీఎం కేసీఆర్‌కు మహిళలంటే గౌరవం లేదని చులకన భావనతో ఉన్నారని, అందుకే తొలి ప్రభుత్వంలో ఒక్క మహిళకు కూడా కేబినెట్‌లో అవకాశం కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిమినల్ కేసులున్న వ్యక్తిని ఎమ్మెల్సీగా గవర్నర్ తిరస్కరించినప్పటి నుండి గవర్నర్‌పై ప్రభుత్వం కోపాన్ని ప్రదర్శిస్తూ వస్తోందని అన్నారు. ప్రభుత్వం చేయలేని పనులను గవర్నర్ చేస్తోందని, ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని, విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయడానికి, వైద్య వ్యవస్థకు పరిరక్షించేందుకు గవర్నర్ కృషి చేస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.