Bandi Sanjay: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం ఉంది..బండి సంజయ్
Bandi Sanjay: దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఉచ్చు బిగుస్తోంది. రేపు ఢిల్లీలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. కవిత బినామీనంటూ అరుణ్ రామచంద్ర పిళ్లై అంగీకరించారని ఈడీ పేర్కొంది.
ఈ తరుణంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఇంతవరకు ఈ విషయంపై సీఎం కెసిఆర్ ఎందుకు స్పందించడంలేదని అన్నారు. ఆపద వచ్చినప్పుడల్లా తెలంగాణ అంటారు. ఈడీ నోటీసులతో బీజేపీకి సంబంధం లేదు.. కవిత వల్ల మహిళలు తలదించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణ సమాజానికి చెప్పి అన్ని పనులను చేస్తున్నామని అంటున్నారు. తెలంగాణ సమాజానికి చెప్పే ఇంతపెద్ద స్కామ్ చేశారా అని ప్రశ్నించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారు..విచారణకు కవిత సహకరించాలి లిక్కర్ స్కామ్‌లో చట్టం తనపని తాను చేసుకుపోతుందని అన్నారు. కవిత వల్ల తెలంగాణ ఆడవారికి చెడ్డపేరు వస్తుందని అన్నారు.