Bandi Sanjay: పిల్లలతో రాజకీయాలా ?..బండి సంజయ్
Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన కొడుకు భగీరథ్ వీడియోపై స్పందించారు. తన కొడుకుపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల జీవితాలతో ఎలా ఆడుకుంటారని ఆయన ప్రశ్నించారు. దమ్ముంటే తనతో రాజకీయం చేయాలంటూ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. పిల్లలు కొట్టుకుంటారు కలుస్తారని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల నుంచి దృష్టి మళ్లించేందుకు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారా.. ప్రోసిజర్ ఫాలో అయ్యారా.. అని పోలీసులను ప్రశ్నించారు. కేసీఆర్ మనుమడి విషయంలో కామెంట్ చేస్తే తాను వ్యతిరేకించినట్టు గుర్తుచేశారు. ఒకవేళ తప్పు చేసుంటే తానే జైలుకు తీసుకొచ్చి అప్పగిస్తానని బండి సంజయ్ తెలిపారు. నేనే పోలీసులకు అప్పగిస్తా థర్డ్ డిగ్రీ చేస్తారా అంటూ నిలదీశారు.
హైదరాబాద్‌లోని మహేంద్ర యూనివర్సిటీలో చదువుతున్నబండి భగీరథ్ ర్యాగింగ్ పేరుతో తన తోటి విద్యార్ధిపై బూతులు తిడుతూ దాడి చేసిన వీడియో వైరల్ అయ్యింది. అతనితో పాటు స్నేహితులు కూడా బాధిత విద్యార్ధినిని చితకబాదారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో బాగా వైరల్ అయ్యింది. దీనిని పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకోవడంతో భగీరథ్‌పై దుండిగల్ పీఎస్‌లో కేసు నమోదు చేసారు. చదువుకునే పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న వ్యక్తి కేసీఆర్ అని ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేసారు.