Bandi Sanjay: సీఎస్ సోమేశ్ కుమార్ అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి, బండి సంజయ్ డిమాండ్
Bandi Sanjay demands CBI inquiry on Somesh kumar
సోమేశ్ కుమార్ పై సీబీఐ విచారణ జరపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కొల్లాపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పేదల ఉసురు పోసుకున్న సీఎస్ ను హై కోర్ట్ చెంప చెళ్లుమనిపించిందని అన్నారు. సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. చాలా మంది తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ లకు పోస్టింగ్ లు ఇవ్వకుండా వేధిస్తున్నారని, తెలంగాణ క్యాడర్ లో సమర్థులు లేరా…? అంటూ నిలదీశారు.
కోర్టులో కేసులు పెండింగ్ లో ఉండగా సోమేశ్ కుమార్ ను సీఎస్ గా నియిమించడం కేసీఆర్ అనైతిక రాజకీయాలకు నిదర్శనమని బండి సంజయ్ అన్నారు. సోమేశ్ కుమార్ ద్వారా అనేక అడ్డగోలు జీవోలు విడుదల చేయించారని బండి సంజయ్ విమర్శించారు.
ఏపీకి కేటాయించిన అధికారులతో తెలంగాణలో పనిచేయించడం అనైతికమని బండి సంజయ్ అన్నారు.ఏపీకి కేటాయించిన వాళ్లను అక్కడకు పంపాలని, తెలంగాణకు కేటాయించిన వారిని ఇక్కడకు వెంటనే తీసుకురావాలని బండి సంజయ్ కోరారు.