Bandi Sanjay: బీఆర్ఎస్ సభపై బండి సంజయ్ విమర్శల వర్షం
Bandi Sanjay comments on BRS Meeting
ఖమ్మంలో బీఆర్ఎస్ సభ జరిగిన తీరుపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పలు విమర్శలు సంధించారు. భారత, న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్ తప్పా బీఆర్ఎస్ సభను ఎవరు పట్టించుకోలేదని బండి సంజయ్ విమర్శించారు. సభకు వచ్చిన జనాలు, నేతలు మనస్పూర్తిగా పాల్గొనలేదని, బెదిరించి సభను సక్సెస్ చెయ్యాలని చూసారని బండి సంజయ్ విమర్శించారు.
కర్నాటక మాజీ సీఎం, బీహార్ సీఎం నితీశ్ కుమార్ సభకు రాని విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు. కేసీఆర్ దగ్గర ఉన్న లిక్కర్ డబ్బులు పంచుకోవడానికి జాతీయ నేతలు వచ్చినట్లున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ నోట ఏ దేశం మాట వచ్చినా ఆ దేశం సర్వనాశనం అవుతుందని, పాకిస్థాన్ గురించి మాట్లాడితే అక్కడ తిండి గురించి కొట్లాడుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. భారత దేశం బాగుందని కేసీఆర్ నోటి వెంట ఆ మాట రావద్దని కోరుకుంటున్నానని బండి సంజయ్ అన్నారు.
తెలంగాణ లో 21 డ్యాంల నిర్మాణాలను 8 సంవత్సరాల నుండి పెండింగులో పెడుతున్నారని, తెలంగాణలో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియదని బండి సంజయ్ ఆరోపించారు. పొలం దగ్గర ఫ్రీ కరెంట్ అని చెబుతున్న నాయకులు, ఇంటి దగ్గర కరెంట్ కు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. డిస్కమ్ లకు డబ్బులు కట్టకుండా ఫ్రీ కరెంట్ అంటున్నారని, డిస్కమ్ లకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని కోరారు. ఫ్రీ కరెంట్ ఇస్తే ఆ ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుందని బండి సంజయ్ అన్నారు. ఖమ్మం సభలో కేసీఆర్ ఇచ్చిన స్పీచ్ గతంలో మాట్లాడిందేనని, కొత్తగా ఏం మాట్లాడలేదని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ వేషం, భాష .. తుపాకి రాముడు వలే ఉన్నాయని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.