Bandi Sanjay: కేంద్ర నిధులపై చర్చకు సిద్ధం, కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్
Bandi Sanjay challenges KCR for Open debate on Central Funds
కేసీఆర్ కుటుంబ సభ్యులు కేంద్ర నిధులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మండి పడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణ లో అమలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని సంజయ్ విమర్శలు గుప్పించారు. 22 నోటిఫికేషన్లు 20 వేల ఉద్యోగాలకు మాత్రమే ఇచ్చిందని గుర్తుచేశారు. ఎంతమందికి నియామక పత్రాలు ఇచ్చిందో ఈ ప్రభుత్వం చెప్పడం లేదని విమర్శించారు. బీజేపీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళన్‌లో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర నిధులపై కేసీఆర్‌తో చర్చకు తాము సిద్దమని .. రాజీనామా పత్రం పట్టుకొని మీ అయ్యను రమ్మను అని మంత్రి కేటీఆర్‌కు సవాలు విసిరారు. గతంలో సవాల్ చేసి తోక ముడుచుకొని పారిపోయింది మీరే అని బండి సంజయ్ విమర్శించారు. అభివృద్ధి గురించి మాట్లాడండి .. రాజకీయాలు తర్వాత అని అన్నారు.
రుణ మాఫీ చేయక పోవడం వల్ల రైతు బందు నిధులను బ్యాంకులు తమ ఖాతాలో వేసుకున్నాయని బండి సంజయ్ గుర్తుచేశారు. నాలుగైదు సంక్షేమ పథకాలు ఇస్తున్నారని, మద్యం వల్ల వచ్చే ఆదాయం అంతకు పది వేలు ఎక్కువ వస్తుందని, మిగతా ఆదాయం అంతా ఎటు పోయిందని ప్రశ్నించారు. ప్రజలు కట్టిన పన్ను ఎటు పోయిందో జాడ లేదని విమర్శించారు.
పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఫిర్యాదు చేయడాన్ని కూడా బండి సంజయ్ తప్పుబట్టారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు అరిచినట్లు అనే సామెత గుర్తుచేశారు.
హిందూ దేవి దేవతలను కించ పరుస్తూ ఉంటే భరిద్దామా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. హిందూ దేవతలను అవమానిస్తే కొడుకులను ఉరికిచ్చి కొట్టే పరిస్థితి వస్తుందని బీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రహించాలని బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పోలింగ్ బూత్ కమిటీ సభ్యులతోనే సాధ్యమని బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. బూత్ కమిటీ సభ్యుడు బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడు కావొచ్చు…. జాతీయ అధ్యక్షుడు కావొచ్చని అన్నారు.