Bandi Sanjay: మహిళా కమిషన్ ముందుకు బండి.. టెన్షన్ టెన్షన్!
Bandi Sanjay: రాష్ట్ర మహిళా కమిషన్ ముందు బీజేపీ చీఫ్ బండి సంజయ్ హాజరయ్యారు. ఉమెన్స్ డే సందర్భంగా ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ వివరణ ఇచ్చారు. ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ పై స్పందించిన బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేయగా ఈ వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. కేసును సుమోటోగా తీసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ ఈ నెల 13న హాజరవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది అయితే పార్లమెంటులో ఉంటానని రాలేనని చెప్పిన బండి సంజయ్ ఈ రోజు హాజరై వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ వద్ద బిజెపి నేతలు, కార్యకర్తలు మోహరించారు. ఈ క్రమంలో భారీగా పోలీసులు కూడా మోహరించి బుద్ధ భవన్ రోడ్డు బారికేడ్స్ తో బ్లాక్ చేసిన పోలీసులు, మహిళా కమిషన్ వద్ద నుండి మహిళా నేతలను వెళ్లిపోమని చెప్పడంతో పోలీసులకు, బిజెపి మహిళా నేతలకు కార్యకర్తలకు ఘర్షణ చోటు చేసుకుంది. మరో పక్క బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా రంగంలోకి దిగి మహిళా కమిషన్ వద్దనుండి బిజెపి నేతలను మహిళా నేతలను పంపించాలి అంటూ నినాదాలు చేశారు. చివరికి బండి సంజయ్ విచారణ అనంతరం వెళ్లిపోవడంతో అక్కడి పరిస్థితి సద్దుమణిగింది.