Gorantla Buchibabu: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్
Gorantla Buchibabu: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్ లభించింది. ఈ మేరకు సీబీఐ స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గోరంట్ల బుచ్చిబాబు రెండు లక్షల పూచికత్తు, పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఇటీవల హైదరాబాద్ కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబు గోరంట్లను అరెస్ట్ చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుమార్తె కె కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు గోరంట్ల అరెస్ట్ కావడంతో కవిత అరెస్ట్ కావడం ఖాయమని అనుకున్నారు. ఇక ప్రస్తుతం బుచ్చిబాబు తీహార్ జైలులో ఉన్నారు. గోరంట్ల బుచ్చిబాబు బెయిల్ కేసు విచారణ సందర్భంగా కేసు విచారణలో ఉన్నందున, నిందితులు సాక్ష్యాలను తారుమారు చేసి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున బెయిల్ మంజూరు చేయరాదని సీబీఐ తన కౌంటర్ అఫిడవిట్‌లో పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూప్ తరపున బుచ్చిబాబు కీలక పాత్ర పోషించారని కూడా సీబీఐ ఆరోపించింది. అయితే ఇందుకు సంబంధించి వాదనలు విన్న కోర్టు బెయిల్ జారీ చేస్తూ ఉత్తర్వులను మార్చ్ 1న రిజర్వ్ చేసింది. ఇక ఈ రోజు బుచ్చిబాబుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఈరోజు కోర్టు ఉత్తర్వులు వెలువరించింది.