AWS: తెలంగాణలో అమేజాన్ వెబ్ సర్వీసెస్ భారీ పెట్టుబడులు
AWS increases investment in Telangana
అమేజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించింది. 2030 నాటికి 4.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సమాయత్తం అవుతోంది. భారత కరెన్సీ ప్రకారం 36,300 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన AWS ఎంపవర్ ఇండియా కార్యక్రమంలో పెట్టుబడుల పెంపు విషయాన్ని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. AWS నెట్ వర్క్ విస్తరణలో భాగంగా ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు తెలుస్తోంది.
AWS సంస్థకు ప్రస్తుతం హైదరాబాద్ లో మూడు డేటా సెంటర్లు ఉన్నాయి. చందన్ వెల్లీ, ఫ్యాబ్ సిటీ, ఫార్మా సిటీలలో ఉన్న డేటా సెంటర్లలో పెట్టుబడులు పెరగనున్నాయి. భారతదేశంలో ఉన్న వినియోగదారులకు మరింత త్వరగా క్లౌడ్ సర్వీసెస్ లభించనున్నాయి.
అమేజాన్ వెబ్ సర్వీసెస్ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. హైదరాబాద్ లో ఉన్న అమేజాన్ డేటా సెంటర్లలో పెట్టుబడుల పెంపు ద్వారా తెలంగాణ రాష్ట్రంలోకి భారీ స్థాయిలో FDIలు రానున్నాయని కేటీఆర్ అన్నారు. ఈ గవర్నెన్స్, హెల్త్ కేర్, మున్సిపల్ ఆపరేషన్స్ విభాగాల్లో అమేజాన్ వెబ్ సర్వీసెస్ సేవలను వినియోగించుకునే విషయమై తెలంగాణ ప్రభుత్వం వారితో కలిసి పనిచేస్తున్న విషయాన్ని కేటీఆర్ తెలియజేశారు.
"I am very excited about the launch of the new region in #Hyderabad"
Hear AWS Hero @faiz_4k talk about how the new Asia Pacific (Hyderabad) region will help developers at #AWSEmpowerIndia. pic.twitter.com/a9EnTgXSRP— AWS Cloud India (@AWSCloudIndia) January 20, 2023
In 2⃣0⃣2⃣2⃣, we launched the 2️⃣nd infrastructure region in #India to help serve end users with even lower latency.
Join us today 🗓️ to 𝘳𝘦𝘵𝘩𝘪𝘯𝘬 𝘸𝘩𝘢𝘵'𝘴 𝘱𝘰𝘴𝘴𝘪𝘣𝘭𝘦 with the AWS Asia Pacific (Hyderabad) Region!https://t.co/8LmlI4UzEy#AWSEmpowerIndia pic.twitter.com/tyjPq2X0LQ— AWS Cloud India (@AWSCloudIndia) January 20, 2023
AWS