అవినాష్ కేసు రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్పై శుక్రవారం రోజున మారథాన్ విచారణ జరిగింది. ముఖ్యంగా అవినాష్ తరపు న్యాయవాదులు సుమారు ఐదు గంటలకు పైగా వారి వాదనలు వినిపించారు.
Avinash Case: అవినాష్ కేసు రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్పై శుక్రవారం రోజున మారథాన్ విచారణ జరిగింది. ముఖ్యంగా అవినాష్ తరపు న్యాయవాదులు సుమారు ఐదు గంటలకు పైగా వారి వాదనలు వినిపించారు. ఒక కేసులో ఒకేరోజు ఒక వ్యక్తి తరపు న్యాయవాదులు ఈ స్థాయిలో వాదనలు వినిపించడం దాదాపు ఇదే మొదటిసారి కావొచ్చు. సునీత తరుపు న్యాయవాదులు కూడా గంటకు పైగా వాదనలు వినిపించారు. శుక్రవారం నాడు ఏడు గంటలకు పైగా ఈ కేసులో విచారణ జరింది. కాగా, నేడు సీబీఐ వాదనలు వింటామని కోర్టు స్పష్టం చేసింది.
అయితే, సీబీఐ దాఖలు చేసిన అనుబంధ అఫిడవిట్లో అనూహ్యంగా సీఎం జగన్ పేరు ప్రస్తావనకు రావడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. హత్య గురించి జగన్కు ముందే తెలుసు అని అఫిడవిట్లో పేర్కొనడంతో ఈ కేసు మరిన్ని కోణాల్లో విచారణ జరిగే అవకాశం ఉంది. కాగా, నేడు సీబీఐ ఏ కోణంలో వాదించబోతున్నారో ఇప్పటికే అర్థమైంది. అయితే, ముందస్తు బెయిల్ అంశంలో కోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతుంది అన్నది చర్చనీయాంశంగా మారింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనాలు ఇన్ని రోజులుగా జరుగుతుండటం విశేషం. ఎలాగైనా ముందస్తు బెయిల్ తెచ్చుకోవాలని అవినాష్ రెడ్డి చూస్తున్నారు. ఒక్కసారి సీబీఐ కస్టడీకి వెళ్లి వాళ్ల విచారణ మొదలుపెడితే దాని తీరు వేరుగా ఉంటుంది. నిజానిజాలను వారు ఏ విధంగానైనా బయటపెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఇన్నేసి గంటలపాటు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసును ఈరోజైనా తేలుస్తారా లేదంటే మళ్లీ వాయిదా వేస్తారా అన్నది చూడాలి.