Gattu Ramachander Rao: వైఎస్సార్ టీపీ అధికార ప్రతినిధిపై పిడి గుద్దులు
Gattu Ramachander Rao: వైఎస్సార్ టీపీ అధికార ప్రతినిధి పై ఆ పార్టీ కార్యకర్తల దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. నిన్న లోటస్ పౌండ్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట మాట పెరగడంతో ఒక్కసారిగా గట్టు రామచంద్ర రావు పైకి వెళ్లిన నేతలు పిడి గుద్దులు గుద్ది దాడి చేసినట్లు చెబుతున్నారు. దిగువ స్థాయి నేతల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ, కోరుకున్న పదవులు ఇపిస్తాను అంటూ భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అంటూ తీవ్ర ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది. గట్టు రామచంద్ర రావు పార్టీ లో దిగువ స్థాయి నేతలను, నియోజకవర్గం కార్యకర్తలు చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు అంటూ బహిరంగానే పార్టీ కార్యాలయంలో కొందరు నేతలు ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గట్టు వ్యవహార శైలి పెద్ద తలనొప్పిగా మారింది అంటూ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది అంటున్నారు. గట్టు పై దాడి చేసిన ఘటనలో రాజేంద్రనగర్ నియోజకవర్గం యువజన విభాగం కర్రే ప్రకాష్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయానికి చెందిన పూర్తి సమాచారం అయితే అందాల్సి ఉంది.