Revanth Reddy on Telagana Elections 2023: రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు… ఫిబ్రవరిలోనే
Revanth Reddy on Telagana Elections 2023: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరులోగా సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని, కేసీఆర్ వ్యూహం చూస్తుంటే అదేవిధంగా ఉందని అన్నారు. గతేడాది సెప్టెంబర్ మాసంలో వానాకాల సమావేశాలు నిర్వహించారని, ఆ తరువాత డిసెంబర్ నెలలో నిర్వహించాల్సిన శీతాకాల సమావేశాలను నిర్వహించలేదని, వ్యూహంలో భాగంగానే కేసీఆర్ శీతాకాల సమావేశాలను నిర్వహించలేదని అన్నారు.
ఫిబ్రవరి నెలాఖరులో అసెంబ్లీని రద్దుచేస్తే ఎప్రిల్ లోగా అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని, తద్వారా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనడానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ముందస్తు ఎన్నికలు ఉండబోవని చెబుతూనే ఎన్నికలకు వెళ్లేందుకు సీఎం కేసీఆర్ ఎత్తుగడలు వేస్తున్నారని అన్నారు. ఈ ఎత్తుగడలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా కృషిచేయాలని నేతలకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.