AP CID in Hyderabad: ఏపీ మాజీ మంత్రి నారాయణ కార్యాలయాల్లో సీఐడీ తనిఖీలు
AP CID raids on Ex Minister Narayana offices in Hyderabad
హైదరాబాద్ మాదాపూర్‌లోని మాజీ మంత్రి నారాయణకి చెందిన NSPIRA సంస్థలో ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు సోదాలు చేపడుతున్నారు. నారాయణ సంస్థల నుండి రామకృష్ణ హౌసింగ్ సంస్థలోకి నిధులు మల్లింపు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు సోదాలు చేపట్టారు. ఈ డబ్బుతో నారాయణ బినామీల పేర్ల పై అమరావతిలో చట్ట విరుద్ధముగా అసైన్డ్ భూముల కొనుగోలు చేశారని అధికారులకు సమాచారం అందింది. దీంతో హైదరాబాదులో మూడు చోట్ల ఏపీ సిఐడి అధికారులు నిర్వహించారు.
NSPIRA సంస్థతో పాటు మరో రెండు సంస్థల్లో సిఐడి అధికారులు సోదాలు చేపట్టారు. మాదాపూర్ లోని మూడు ప్రాంతాల్లో సిఐడి సోదాలు కొనసాగుతున్నాయి. NSPIRA కార్యాలయంలో 40 కంప్యూటర్ హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. రామకృష్ణ హౌసింగ్ సొసైటీ నుంచి పెద్ద మొత్తంలో నిధులు బదిలీ జరిగినట్లు అధికారులు గుర్తించారు. అమరావతిలో వందల ఎకరాల అసైన్డ్ భూములు కొనుగోలు చేసినట్టుగా సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. అసైన్డ్ భూముల కొనుగోలు హవాలా ద్వారా డబ్బులు బదిలీ అయినట్లుగా సిఐడి అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.