BRS New Target: మంత్రి హరీష్‌రావుకు మరోకొత్త టాస్క్
BRS New Target: ఈనెల 18 వ తేదీన బీఆర్ఎస్ పార్టీ తొలి బహిరంగ సభను ఖమ్మంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను చురుగ్గా చేస్తున్నారు. అదే రోజున ఖమ్మంజిల్లాకు చెందిన కొందరు బలమైన నేతలు ఆ పార్టీని వీడబోతున్నారు. ఇందులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల ఉన్నారు. వీరితో పాటు మరికొంతమంది నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు సిద్దమౌతున్న తరుణంలో దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు కారు సిద్దమైంది. ఖమ్మం జిల్లాలో పట్టు సాధించే బాధ్యతలను ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్‌రావుకు అప్పగించింది. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు, జిల్లాలో దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని హరీష్ రావుకు సూచించారు సీఎం కేసీఆర్.
2018వ సంవత్సరంలోనూ బలమైన నేతలను ఓడించే బాధ్యతలను మంత్రి హరీష్‌రావుకు అప్పగించారు. ఆ బాధ్యతలను హరీష్‌రావు సక్రమంగా నిర్వహించడంతో మరోసారి ఆయనకే ఇలాంటి కష్టతరమైన బాధ్యతలను అప్పగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో పార్టీని వీడేవారిని బుజ్జగించి పదవులు, సీట్లు ఇచ్చే విధంగా హమీలు ఇచ్చేందుకు పార్టీ నేతలు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. పొంగులేటితో పాటు ఆయన అనుచరులు కూడా పార్టీని వీడనున్నారు. ఎవరెవరు ఆయన వెంట వెళ్తారన్నది మరో రెండు మూడు రోజుల్లో స్పష్టమయ్యే అకవాశం ఉన్నది.