Hyderabad:నగరంలో నెలాఖరుకల్లా మరో ఫ్లై ఓవర్ సిద్ధం
Hyderabad: వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా హైదరాబాద్‌లో మెరుగైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. జీహెచ్‌ఎంసీ, ఎస్‌ఆర్‌డీపీ కింద మొత్తం 47 ప్రాజెక్టులనుచేపట్టి ఒక్కొక్కటిగా పనులు పూర్తి చేసుకుంటూ వస్తుంది. ఇప్పటి వరకు 31 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మరో 16 ఫ్లై ఓవర్ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈమద్యే మంత్రి కేటీఆర్ నగరవాసులకు కానుకగా కొత్తగూడ ఫ్లై ఓవర్ ను ప్రారంభించారు. దీంతో నగరవాసులకు అలాగే ఆ మార్గం గుండ అప్రయాణించే వారికీ ట్రాఫిక్ సమస్యలు తీరిపోయాయి. ఇక మరో మరో ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది.
ఎస్సార్డీపీలో భాగంగా 22.55 కోట్ల వ్యయంతో 760 మీటర్లు పొడవుతో 12 మీటర్ల వెడల్పుతో చేపట్టిన నిర్మాణం ఎల్బీనగర్ చౌరస్తాలో ముస్తాబవుతోంది. వనస్థలిపురం నుంచి వచ్చే వాహనాలు జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ ఎక్కి నేరుగా ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ ముందు రోడ్డు దిగేలా వంతెనను నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్ తుదిమెరుగులు దిద్దికుంటుంది.. ఈ వంతెనను నెలాఖరులో మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.