Amit Shah: ఈ నెల 28న తెలంగాణకు అమిత్ షా, సంస్థాగత అంశాలే ఎజెండాగా పర్యటన
Amit Shah to visit Telangana on January 28
తెలంగాణలో అధికారంలో రావాలని తీవ్రంగా కృషి చేస్తున్నబీజేపీ ఆ విధంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో అగ్ర నాయకుల పర్యటనలు వరుసగా ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 19న ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు రానుండగా..ఇదే నెలలో అమిత్ షా కూడా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 28 న తెలంగాణకు అమిత్ షా వస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పార్టీ సంస్థాగత అంశాలే ప్రధాన అజెండాగా అమిత్ షా పర్యటన కొనసాగనుంది. వివిధ స్థాయిలో పార్టీ నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ… దిశా నిర్దేశం చేయనున్నారు. సంఘ్ నేతలతో సమావేశం అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
గత ఏడాదిలో అమిత్ షా తెలంగాణలో ఐదుసార్లు పర్యటించారు. అనేక కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. టార్గెట్లను ఫిక్స్ చేశారు. ఎవరేం చేయాలనే విషయంలో నూటికి నూరు శాతం క్లారిటీ ఇచ్చారు.
అమిత్ షా, జేపీ నడ్డా ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ బీజేపీ నాయకులు కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌లు కేసీఆర్ సర్కార్‌ను ఇరకాటంలో పెడుతూనే ఉన్నారు. పదునైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు. డిఫెన్స్ లో పడేస్తున్నారు. వీళ్లు చేస్తున్న విమర్శలతో గులాబీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.