Amit Shah : హైదరాబాద్ కు అమిత్ షా
Amit Shah Hyderabad Tour: ఆదివారం హైదరాబాద్‌లోని హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (ఎన్‌ఐఎస్‌ఏ) క్యాంపస్‌లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) 54వ రైజింగ్ డే పరేడ్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షించనున్నారు. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్) వెలుపల సిఐఎస్‌ఎఫ్ రైజింగ్ డే వేడుకలను నిర్వహించడం ఇదే తొలిసారి అని అడిషనల్ డిజి (నార్త్) పియూష్ ఆనంద్ అన్నారు. ఆయన మాట్లాడుతూ రైసింగ్ డే వేడుకలను వివిధ ప్రాంతాల్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇది జరుగుతోందని అన్నారు. ఇక ఆయన చెబుతున్న దాని ప్రకారం, CISF ఒక పాన్-ఇండియా దళం కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు బలగాలను దగ్గరగా చూడాలని ప్రభుత్వం భావించింది, అందుకే ఇక మీదట ప్రతి సంవత్సరం ఈ వేదిక మారుతుంది. ఆదివారం ఉదయం, హోం మంత్రి NISA వద్ద కొత్త ఫైరింగ్ రేంజ్‌ను ప్రారంభిస్తారు, ప్రదర్శనలను సమీక్షిస్తారు. రైజింగ్ డే పరేడ్ తర్వాత, వేడుకల్లో భాగంగా శిక్షణ పొందిన సిబ్బంది మూడు ప్రత్యేక ప్రదర్శనలు ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ కి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రాత్రి 8 గంటల 25 నిమిషాలకి రానున్నారు. హకిం పేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న షా రేపు మధ్యాహ్నం కొచ్చి వెళ్లనున్నారు. అమిత్ షా పర్యటన లో బీజేపీ రాష్ట్ర నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.