Amit Shah at CISF Rising Day Parade: సీఐఎస్ఎఫ్ పరేడ్ లో కేంద్ర మంత్రి అమిత్ షా
Amit Shah at CISF Rising Day Parade: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బీజేపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. కాగా, ఈరోజు ఉదయం అమిత్ షా హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ అకాడమీలోని సీఐఎస్ఎఫ్ రైజింగ్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 53 ఏళ్లుగా సీఐఎస్ఎఫ్ దేశానికి సేవలు అందిస్తోంది. ఈ సంస్థ అందిస్తున్న సేవలను దేశం గౌరవిస్తూనే ఉన్నది. దీనికి సంబంధించిన పరేడ్ ప్రతి ఏడాది మార్చి 12వ తేదీన నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి ప్రత్యేకంగా హాజరౌతుంటారు.
ఈ ఏడాది కేంద్ర హోంమంత్రి హోదాలో అమిత్ షా హాజరయ్యారు. సీఐఎస్ఎఫ్ అకాడమీ నుండి ట్రైనింగ్ పూర్తి చేసుకున్న సిబ్బంది పరేడ్ నిర్వహించారు. అమిత్ షాతో పాటు ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. సీఐఎస్ఎఫ్ కార్యక్రమం ముగిసిన తరువాత అమిత్ షా హకీంపేట నుండి శంషాబాద్ చేరుకుంటారు. అక్కడి నుండి బెంగళూరు బయలుదేరి వెళ్తారు. ఈఏడాది కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఈ రెండు రాష్ట్రాలపై కన్నేసింది.