Rajiv Gandhi International Airport : ప్యాసెంజర్ కు గుండెపోటు… ఎమర్జెన్సీ ల్యాండింగ్
Air passenger dies of cardiac arrest after landing at Hyderabad airport : మంగళవారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు గుండిపోటుతో మరణించాడు. కువైట్-హైదరాబాద్ ఫ్లైట్లో సదరు వ్యక్తి ప్రయాణిస్తుండగా అతనికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. అదే విషయాన్ని అతను విమానంలోని స్టాఫ్ కి తెలియజేయగా, పైలట్ హైదరాబాద్ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, వైద్య బృందాలను అప్రమత్తం చేసి వెంటనే ల్యాండ్ చేశాడు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. విమానం ల్యాండ్ అయ్యి, విమానాశ్రయం ఆవరణలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రయాణికుడు మృతి చెందాడు. అయితే ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. RGIA పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలుసుకుని, వారి కుటుంబ సభ్యులను విషయాన్ని చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నారు.