AICC Incharge Manik Rao Thackeray Telangana Tour: హైదరాబాద్‌కు మానిక్‌రావ్ థాకరే… మూడు రోజుల పర్యటన
AICC Incharge Manik Rao Thackeray Telangana Tour: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు, తిరిగి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఇన్‌చార్జ్‌లను మార్చింది. మాణిక్యం ఠాగూర్ స్థానంలో మానిక్‌రావ్ థాకరేను నియమించింది. కాగా, మానిక్‌రావ్ థాకరే మూడు రోజులపాటు తెలంగాణలో పర్యటించేందుకు ఈనెల 20వ తేదీన హైదరాబాద్‌కు వస్తున్నారు. శుక్ర,శని, ఆదివారాల్లో ఆయన వరసగా సమావేశాలు నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు వివిధ స్థాయి నేతలతో వివిధ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు.
క్యాంపెయిన్ కమిటీ, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ, ఏఐసీసీ ప్రొగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీలతో ఆయన సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు పీసీసీ అధ్యక్షుడితో పాటు ఏఐసీసీ కార్యదర్శులు కూడా హాజరుకానున్నారు. ఇక, జనవరి 21వ తేదీన టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీతో ఆయన భేటీ అవుతారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి తలపెట్టిన హాత్ సే హాత్ జోడో కార్యక్రమంపై కూడా చర్చిస్తారు. జనవరి 22వ తేదీన నాగర్ కర్నూల్‌లో సీనియర్ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశం ముగిసిన తరువాత ఆయన హైదరాబాద్‌కు తిరిగి వచ్చి అక్కడి నుండి నేరుగా పూణేకు వెళ్లనున్నారు.