Hyderabad: హైదరాబాద్‌లోని ఓ సూపర్ మార్కెట్లో (Super market) పాడైపోయిన పదార్థాలను విక్రయించారు. వాటిని గమనించిన కస్టమర్లు (customers) సూపర్ మార్కెట్ ఎదుట ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రితంగా మారడంతో స్టోర్ మేనేజర్ (Store manager) అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
Hyderabad: హైదరాబాద్‌లోని ఓ సూపర్ మార్కెట్లో (Super market) పాడైపోయిన పదార్థాలను విక్రయించారు. వాటిని గమనించిన కస్టమర్లు (customers) సూపర్ మార్కెట్ ఎదుట ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రితంగా మారడంతో స్టోర్ మేనేజర్ (Store manager) అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో కస్టమర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన సుచిత్రలోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో చోటుచేసుకుంది.
ఏం జరిగిందంటే..
సోమవారం ఓ కస్టమర్ సుచిత్రలోని రత్నదీప్ సూపర్ మార్కెట్‌కు వెళ్లి చికెన్ నగ్గెట్స్ (Chicken nugget) కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి ఓపెన్ చేసి చూసిన సదరు కస్టమర్ ప్యాకెట్లో పాడైపోయిన పదార్థాలు ఉండడం చూసి షాక్ అయిపోయాడు. అంతేకాకుండా ప్యాకెట్ నుంచి దుర్వాసన రావడంతో వాటిని తీసుకొని వచ్చి స్టోర్ మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో స్టోర్‌లో ఉన్న మరిన్ని ప్యాకెట్లను ఓపెన్ చేసి చూడగా.. అవి కూడా పాడైపోయాయి. అదే సమయంలో మరో ఇద్దరు కస్టమర్లు కూడా పాడైపోయిన ప్యాకెట్లను తీసుకొని సూపర్ మార్కెట్‌కు వచ్చారు. స్టోర్ మేనేజర్‌ను నిలదీశారు.
దీంతో మేనేజర్ వారికి సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పరిస్థితి ఉద్రితంగా మారడంతో మరో ఏరియా మేనేజర్ వచ్చి కస్టమర్లతో మాట్లాడారు. మంగళవారం మాట్లాడుకుందామని వారికి సర్ది చెప్పారు. ఆ తర్వాత కస్టమర్లు దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సూపర్ మార్కెట్, స్టోర్ మేనేజర్‌పై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.