లోక్ సభ ఎన్నికల నాటికి దేశంలో బీఆర్ఎస్ పార్టీ బలీయమైన శక్తిగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్బవిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.
Minister Jagadeesh Reddy: లోక్ సభ ఎన్నికల నాటికి దేశంలో బీఆర్ఎస్ పార్టీ బలీయమైన శక్తిగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్బవిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. విజన్ ఉన్న నాయకుడిగా దేశ ప్రజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎనలేని ఆదరణ ఉందని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ నమోదు చేసుకున్న విజయంపై ఆయన స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో సృష్టించిన ప్రభంజనం సెగలు హస్తనకు తాకుతున్నాయాన్నారు.
2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. నోట్ల రద్దుపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. దేశంలో రెండు వేల నోట్ల రద్దు అనేది మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలో అభివృద్ధిని వెనక్కు తీసుకపోవడమే అన్నారు. నోట్ల రద్దుతో దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీసే కుట్ర జరుగుతుందన్నారాయన. గతంలో నోట్ల రద్దుతో ఎలాంటి ప్రయోజనాలు జరిగాయో చెప్పలేదని.. ఇది దేశానికి ఉపయోగపడే పని కాదని తెలిపారు. మోడీ సర్కార్ కొందరి ప్రయోజనాల కోసమే నోట్ల రద్దు చేసిందన్నారు. కొత్త పెట్టుబడిదారులతో మోడీ రహస్య ఎజెండాలో బాగమే రెండు వేల నోట్ల రద్దు అని అన్నారు. అసలు 2,000 నోట్లను ఎందుకు తెచ్చారో.. ఎందుకు రద్దు చేశారో దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపయోగం లేదనుకున్నప్పుడు ఎందుకు తీసుకొచ్చారన్న సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని చెప్పారు.