Hyderabad: అనుష్క పేరిట మోసం, పోలీసులను ఆశ్రయించిన నిర్మాత
A Manager cheated a young Producer
సినీ పరిశ్రమలో కేటుగాళ్లకు కొదవలేదు. అమాయకులను టార్గెట్ చేస్తూ లక్షల్లో కాజేస్తున్న వారు గురించి మనం తరచూ వింటూ ఉంటాం. అటువంటి సంఘటన ఇటీవల కాలంలో మరొకటి జరిగింది. ఒక వర్ధమాన నిర్మాతకి ఓ కేటుగాడు వల పన్నాడు. తనకు సినీ పరిశ్రమకు చెందిన చాలా మందితో పరిచయాలు ఉన్నాయని చెప్పి నమ్మించాడు. సినీ నటి అనుష్క, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ అపాయింట్ మెంట్ ఇప్పిస్తానని చెప్పి నిర్మాతను బురిడీ కొట్టించాడు. కేటుగాడి వలలో పడ్డ ఆ నిర్మాత ఏకంగా 51 లక్షల రూపాయలు వాడికి ఇచ్చాడు.
విశ్వకర్మ క్రియేషన్ అధినేత అయిన లక్ష్మణ్ చారి మోస పోయాడు. తాను మోసపోయానని కొంత కాలానికి గుర్తించిన నిర్మాత లక్ష్మణ్ చారి నిర్మాతల మండలిని ఆశ్రయించాడు. వారికి ఫిర్యాదు చేశాడు. మేనేజర్ అని చెప్పుకు తిరుగుతున్న ఆ కేటుగాడిని నిర్మాత మండలి సభ్యులు మందలించారు. నిర్మాతకు డబ్బులు తిరిగి ఇచ్చేయాలని కోరారు. నిర్మాత మండలి చెప్పినప్పటికీ ఆ కేటుగాడిలో మార్పు రాలేదు. దీంతో నిర్మాత లక్ష్మణ్ చారి పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు చేశాడు.