Hyderabad: పెళ్లికి నో చెప్పిన వధువు..కారణంఏంటో తెలుసా
Hyderabad: దేశవ్యాప్తంగా అమ్మాయిని అబ్బాయి పెళ్లి చేసుకోవడం కోసం అమ్మాయి తరపు కుటుంబం అబ్బాయికి కట్న కానుకలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. చట్ట ప్రకారం ఇదీనేరమే కానీ ప్రతి పెళ్ళిలో ఇదో తంతుగా మారింది. ఈ కట్నాలు, కానుకల తంతు అనధికారికంగా ప్రతి పెళ్లిలోనూ జరుగుతుంది. అడిగినంత కట్నం ఇవ్వలేదనో, కట్నం తక్కువ అయ్యిందనో పెళ్లికి వరుడు నో చెప్పిన ఘటనలు అనేకం జరిగాయి. చివరి నిమిషంలో పెళ్లి కొడుకో లేదా పెళ్లి కొడుకు తల్లిదండ్రులో కట్నం విషయంలో అలిగి పెళ్లి రద్దు చేస్తుంటారు. కానీ హైదరాబాద్ లో కట్నం విషయంలో సీన్ రివర్స్ అయింది.
పెళ్లి కూతురు.. పెళ్లి కొడుక్కి, అతడి బంధువులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కాసేపట్లో పెళ్లి అనగా.. సరిగ్గా తాళి కట్టే ముహూర్తం సమయానికి వధువు పెళ్లికి నో చెప్పింది. పెళ్లిని క్యాన్సిల్ చేసింది. ఎదరు కట్నం సరిపోదని తేల్చి చెప్పేసింది. మేడ్చల్ మల్కాజ్ గిరి ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది. అబ్బాయి తరపు వారు అమ్మాయికి రూ.2లక్షలు ఎదురు కట్నం ఇచ్చేలా కుల పెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల మధ్య అంగీకారం కుదిరింది. తీరా పెళ్లి మరో గంట ఉండంగా వధువు కట్నం సరిపోలేదని అనడంతో.. న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు.. అమ్మాయి కుటుంబసభ్యులను పోలీస్ స్టేషన్ కు రప్పించారు. అమ్మాయికి ఎంతనచ్చచెప్పిన వధువు నో చెప్పేసరికి తొలుత ఇచ్చిన రూ.2లక్షలను సైతం అబ్బాయి కుటుంబసభ్యులు వదులుకున్నారు. తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.