Tspsc: టీఎస్పీఎస్సీ కి షాక్ గతంలో జరిగిన ఆ పరీక్ష పేపర్ కూడా లీక్
Tspsc: టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్, వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష ప్రశ్నపత్రాలు మాత్రమే కాకుండా మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీరింగ్ పరీక్ష పత్రం కూడా లీకైనట్లు పోలీసులు తెలిపారు. లీకేజీ వ్యవహారంలో 9 మంది నిందితులని పోలీసులు అరెస్టు చేశారు. టీఎస్పీఎస్సీ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష పేపర్ కూడా లీకైందని గుర్తించామని చెప్పారు. దీంతో టీఎస్‌పీఎస్సీ అధికారులు తలలుపట్టుకున్నారు.
ప్రశ్నాపత్రాల లీక్ టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల పనే అని తేల్చారు. టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్.. ఔట్ సోర్సింగ్ నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్ రెడ్డి ప్రశ్నాపత్రాలను దొంగిలించారని గుర్తించారు. రేణుక, ఆమె భర్త ఢాక్యా నాయక్ లతో కుదిరిన ఒప్పందం మేరకు ప్రశ్నపత్రాలు చోరీ చేశారని వీరి నుంచి నలుగురు వ్యక్తులు పేపర్లు కొనుగోలు చేశారని పోలీసులు విచారణలో తెలిపారు.
అనుమానితుడిగా ఉన్న ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.. అతని నుంచి పేపర్ కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వచ్చిన ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలుసూత్రధారి రేణుక అని తేలింది. ప్రవీణ్ కుమార్ కు రేణుక తో స్నేహం ఉంది. ఈ క్రమంలోనే అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నా పత్రం కావాలని రేణుక ప్రవీణ్ ను అడిగింది. భర్త ఢాక్యా నాయక్ తో కలిసి డీల్ చేసిన రేణుక రూ. 10 లక్షలు ఇస్తామని ప్రవీణ్ కి చెప్పింది. దీంతో అతను పేపర్ ను రేణుకకు అందించాడు. ఇందులో కీలకంగా వ్యవహరించిన తొమ్మిది మంది ని అరెస్ట్ చేసారు.