Jubilee Hills Gang Rape : అమ్నీషియా పబ్ రేప్ కేసులో 2 కోర్టుల్లో చార్జ్‌షీట్ దాఖలు
Jubilee Hills Gang Rape Update : అమ్నీషియా పబ్ రేప్ కేసులో తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు 2 కోర్టుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. 56 రోజుల్లోనే జువైనల్ కోర్టుతోపాటు నాంపల్లి కోర్టులో పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేయడం విశేషం. ఇక ఇందులో సాదుద్దీన్‌తో పాటు ఐదుగురు జువైనల్స్‌పై అభియోగాలు మోపారు. అందులో ఎమ్మెల్యే కొడుకు కూడా ఉన్నాడు. ఈ మేరకు 65 మంది సాక్షుల వాంగ్మూలం సేకరించిన పోలీసులు 600 పేజీలతో చార్జ్‌షీట్ వేశారు. అంతేకాదు ఎఫ్ఎస్ఎల్, డీఎన్ఏ, సీసీ ఫుటేజ్, ఫోన్ల రికార్డ్, మెసేజ్‌లు, ప్రొటెన్సివ్ టెస్ట్, సాంకేతిక ఆధారాలు కూడా పొందుపర్చారు. అందులో నిందితులు ఉద్దేశపూర్వకంగానే బాలికను పబ్‌లో ట్రాప్ చేసి రేప్ చేసినట్టు వెల్లడించారు.
కాగా మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై జూబ్లీహిల్స్ పోలీసులు మరో మైనర్, మేజర్ సాదుద్దీన్ మాలిక్‌తో కలిసి నలుగురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు మైనర్లకు జువైనల్ జస్టిస్ బోర్డు (జేజేబీ) బెయిల్ మంజూరు చేసింది. వారందరినీ మంగళవారం సాయంత్రం జువైనల్ హోం నుంచి విడుదల చేశారు.
17 ఏళ్ల బాలికపై మే 28న జూబ్లీహిల్స్‌లోని ఏకాంత ప్రదేశంలో కారులో లైంగిక వేధింపులు జరిగాయి. ఆమె పబ్‌కు వెళ్లగా, నిందితులు డ్రాప్ చేస్తామనే సాకుతో ఆమెను తమ వెంట తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమెను బేకరీకి తీసుకెళ్లి అక్కడి నుంచి ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.