Urban forest parks: 22 కోట్ల వ్యయంలో 6 అర్బన్ ఫారెస్టు పార్కులు
రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో కొత్తగా 6 అర్భన్ ఫారెస్టు పార్కులు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణమంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఈ అర్భన్ పార్కులను ప్రారంభించారు. నాగారం, పల్లెగడ్డ, సిరిగిరిపురం, శ్రీనగర్, తుమ్మలూరు, మన్యన్కంచ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ పార్కులకు 22 కోట్ల వ్యయం అయింది. హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ 6 పార్కులను తీర్చిదిద్దింది.
హరితహారం 8వ విడతలో 19.54 మొక్కలు నాటే కార్యక్రమం త్వరలోనే ప్రారంభం కానుందని అటవీశాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పూర్తితో ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విషయంపై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న నగరంలో ఫారెస్టు పార్కులు ఏర్పాటు చేయడం పట్ల మరో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అర్భన్ పార్కుల్లో వారంలో ఒక రోజు ప్రజలకు ఉచిత ప్రవేశం ఉంటుందని మంత్రి సబిత వెల్లడించారు.
@HarithaHaram @SmitaSabharwal@HMDA_Gov @CDMA_Municipal @GHMCOnline @Andrew007Uk @swachhhyd@dobriyalrm @DisttForester @moefcc @KonathamDileep pic.twitter.com/XYaWE4gn1z
— Telangana Forest Dept. తెలంగాణకు హరితహారం (@HarithaHaram) July 28, 2022
రాష్ట్రవ్యాప్తంగా 700 కోట్ల వ్యయంతో 109 అర్బన్ ఫారెస్టు పార్కులను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 39 అర్బన్ పార్కులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ప్రారంభించిన 6 కొత్త పార్కులతో కలిపి ఆ సంఖ్య 45కి చేరింది. ప్రతి పార్కును అద్భుతంగా తీర్చి దిద్దారు. ప్రజలకు ఆహ్లాదం అందించే విధంగా వాకింగ్ పాత్, వ్యూ పాయింట్లు ఉన్నాయి. విడదల వారీగా మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.