Urban Parks: అందుబాటులోకి మరో 6 అర్భన్ పార్కులు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో 6 అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు అందుబాటులోకి రానున్నాయి. ఈ పార్కులను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి రేపు ప్రారంభిస్తారు. ఉదయం 9 గంటలకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు నాగారం, 10.35 గంటలకు పల్లెగడ్డ, 11 గంటలకు సిరిగిరిపూర్, 11.30 గంటలకు శ్రీ నగర్, మధ్యాహ్నం 12 గంటలకు తుమ్మలూర్, 12.40 గంటలకు మన్యంకంచ అర్బన్ ఫారెస్ట్ పార్క్ లను ప్రారంభిస్తారు.
కేసీఆర్ సర్కార్ పర్యావరణ పరీరక్షణకు, పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలంగాణకు హరితహారంలో భాగంగా రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కలతో పాటు, రాష్ట్ర మంతటా పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో కొద్ది భాగాన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా అభివృద్ది చేస్తోంది.
ప్రతీ అర్బన్ ఫారెస్ట్ పార్కులో తప్పని సరిగా ఎంట్రీ గేట్, వాకింగ్ పాత్, వ్యూ పాయింట్ ఏర్పాటు మొదటి దశలో ఉండాలని, అటవీ ప్రాంతం అంతా రక్షణ గోడ లు నిర్మిస్తున్నారు తరువాత దశలో పిల్లల ఆట స్థలం, యోగా షెడ్, సైక్లింగ్, వనదర్శిని కేంద్రం లాంటి సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యతను ఇవ్వనున్నారు..
అర్బన్ పార్కులను గాంధారి వనం, ప్రశాంతి వనం, అక్సిజన్ పార్క్, శాంతి వనం, ఆయుష్ వనం, పంచతత్వ పార్క్ తదితర ధీములతో అభివృద్ధి చేస్తున్నారు.