6 Members Died in Jawahar Nagar: ఐదుగురు విద్యార్థులు చెరువులో ఈతకు వెళ్లి ఎంతో ఉత్సాహంగా ఈత కొట్టారు. చాలా సందడిగా గడిపి ఈత కొడుతూ కాస్త లోపలికి వెళ్లారు. అంతే.. నీటిలో మునిగిపోయి చనిపోయారు. వీరిని కాపాడేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయుడు కూడా నీటిలో మునిగి మరణించడం షాక్ కలిగిస్తోంది. ఈ విషాద ఘటన మేడ్చల్ జిల్లా జవాహర్ నగర్ లో చోటు చేసుకుంది. జవహార్‌నగర్ పరిధిలో ఉన్న మల్కాపురంలోని ఎర్రగుంట చెరువులో ఈతకు దిగి ఆరుగురు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మృతుల్లో 5 మంది మదర్సా విద్యార్థులు ఉండగా ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. వీరంతా అంబర్‌పేటలోని మదర్సా విద్యార్థులుగా గుర్తించారు. చెరువులోకి ఐదుగురు విద్యార్థులు వెళ్లి ఈతకు వెళ్లి నీట మునిగారు.. వీరంతా 12 నుంచి 14 సంవత్సరాల విద్యార్థులేనని తెలుస్తోంది.