మే 21 నుంచి 27 వరకు ఈ వారంలో అన్ని రాశుల వారికి ఎలా వుండబోతుంది.?
మేషరాశి
కుటుంబ సభ్యులతో అకారణ విరోధాలు.కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఆస్తుల విషయంలో సోదరులతో వివాదాలు. రాబడి కంటే ఖర్చులు అధికం. వ్వాపార,వాణిజ్య వేత్తలకు కొన్ని అంచనాలు తప్పుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు.రాజకీయ వేత్తలు, వైద్యులకు నిరూత్సాహం. విద్యార్ధులకు ఒత్తిడులు పెరుగుతాయి. మహిళలు ,కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహాయం వుండదు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. అదనపు ఆదాయం సమకూరుతుంది. స్నేహితులతో వివాదాలు పరిష్కారం. వాహనయోగం,వ్వాపారులకు లాభాలు. ఉద్యోగులకు మంచి గుర్తింపు .కళాకారులకు నూతనోత్సాహం కలుగుతుంది.
వృషభరాశి
ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్ధిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు.ఆస్తి వివాదాలు నుండి బయట పడుతారు. పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకుంటారు. వ్వాపార వాణిజ్య వేత్తలకు కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులకు వున్నత స్థాయి పోస్టులు.పారిశ్రామిక వేత్తలు,వ్యవసాయదారులకు మరింత అనుకూలం. విద్యార్ధులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. బంధువులను కలుస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్వాపారులకు ఆశించిన పలితాలు దక్కుతాయి.
మిథునరాశి
ఆర్ధిక పరిస్థితి నిరాశజనకంగా వుంటుంది. రుణాలు సైతం అందక ఇబ్బంది పడుతారు. భూవివాదాలు నెలకొంటాయి. వాహనాలు,అభరణాలు కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు వుంటాయి. ఆలయాలు సందర్శిస్తారు.ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు వుండవచ్చు. కనకధార స్తోత్రాలు పఠించండి. అంతా మంచే జరుగుతుంది.
కర్కాటక రాశి
ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆర్ధిక లావాదేవీలు సంతృప్తికరంగా వుంటాయి. కొన్ని వివాదాల నుండి బయట పడుతారు. పుణ్య క్షేత్రాల సందర్శనం. వ్యాపార వాణిజ్య వేత్తలకు కొత్త సంస్థల ఏర్పాటులో విజయం.ఉద్యోగాల్లో వివాదాలు సర్దుబాటు అవుతాయి. మహిళలకు సంతోషకరమైన సమయం. విష్ణు సహస్ర నామ పారాయణం చేయండి. బంధువులతో విభేదాలు.శ్రమ మరింత పెరుగుతుంది. వ్యాపారులకు మరింత ఒత్తిడులు.
సింహం రాశి
దూర ప్రాంతాల నుండి శుభవార్తలు.నూతన కార్యక్రమాలు చేపడుతారు. శుభకార్యాల్లో పాల్గోంటారు. రావాల్సిన బాకీలు సకాలంలో అందుకుంటారు. ఎతంటి వారినైనా ఆకట్టుకుని ముందుకు సాగుతారు. గృహనిర్మాణ యత్నాలు సాగిస్తారు.ఉద్యోగులు విధుల పట్ల చూపిన శ్రద్దకు ప్రశంసలు పొందుతారు. మహిళలకు ఆస్తి లాభాలు. వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఉద్యోగులకు చిక్కులు తొలుగుతాయి.
కన్య రాశి
కొన్ని కార్యక్రమాలు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలహాలు.ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. ఒక సమాచారం కొంత ఇబ్బందిని కలిగిస్తుంది. రాబడి నిరూత్సాహపరుస్తుంది. ఉద్యోగులకు , బాధ్యతలు పెరుగుతాయి. పారిశ్రామిక వేత్తలకు,వైద్యులకు కొత్త చిక్కులు . గణపతిని పూజించండి. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి.
తుల రాశి
కుటుంబ సభ్యుల నుండి విమర్శలు అందుకుంటారు. మానసిక అశాంతి. ఆర్ధిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు వుంటాయి. కొన్ని కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ద వహించండం మంచిది. ఉద్యోగులకు కొన్ని మార్పులు వుండవచ్చు. శివాలయంలో ప్రదర్శనలు చేయాలి.
వృశ్చిక రాశి
భూ వివాదాలపై చర్చలు సఫలం. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్ధిక పరిస్థితి స్థిరంగా వుంటుంది. పాత మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ఆభరణాలు,స్థలాలు కొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం . హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
ధనస్సు రాశి
నూతన ఉద్యోగాలలో ప్రవేశిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. సోదరులు,మిత్రులతో వివాదాలు సర్ధుబాటు కాగలవు. వాహనాలు,అభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యతిరేకులు సైతం మిత్రులుగా మారుతారు. అవసరాలకు డబ్బు అందుతుంది. ఉద్యోగాల్లో వున్నత స్థితికి చేరుకుంటారు. నరసింహస్వామిని పూజించండి.
మకర రాశి
ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. ఇంటా బయట ఒత్తిడులు అధికమవుతాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. కొత్తగా అప్పులు చేస్తారు. ఉద్యోగులు విధుల పట్ల మరింత శ్రద్ధ చూపాలి. విద్యార్ధులు అవకాశాలు చేజార్చుకుంటారు. దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకోండి . అంతా మంచే జరుగుతుంది.
కుంభ రాశి
వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఏర్పడుతాయి. భూ వివాదాలు చికాకు పరుస్తాయి. ఒక సమాచారం కొంత ఇబ్బంది పెడుతుంది. ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడుతాయి.సోదరులు,మిత్రులతో విబేధాలు.ఆర్ధిక పరిస్థితి కొంత నిరాశ పెడుతుంది. ఉద్యోగాల్లో మార్పులు. మహిళలకు చికాకులు తప్పవు. శివ స్తోత్రాలు పఠించండి.
మీన రాశి
సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు.ఆర్ధిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా వుంటాయి. అంచనాలు నిజమై ముందుకు సాగుతారు. సేవాకార్యక్రమాల్లో పాల్గోంటారు. చిరకాల స్వప్నం నేరవేరుతుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. వ్వాపారులకు చిక్కులు.ఉద్యోగులకు చిక్కులు ఏర్పడుతాయి.