ఈ రోజు రాశిఫలాలను చూస్తే మిశ్రమ ఫలితాలతో ఉత్సాహంగా వుంటారు.మే 24-2023, బుధవారం,రాశిఫలాలు
మేషరాశి
ఒక ప్రణాళిక బద్ధంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్ధిక విషయాలు ఆశాజనకంగా వుంటాయి. సన్నిహితులతో వ్వక్తిగత విషయాలు చర్చిస్తారు. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. కొన్ని వివాదాలు కొంత చిరాకు పరుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపార ,వాణిజ్య వేత్తలు మరింత ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కీలక సమాచారం రావచ్చు. విష్ణు సహస్ర నామ పారాయణం చేయండి. కుటుంబంలో మరింత ఒత్తిడులు, శ్రమ మరింత పెరుగుతుంది.
వృషభరాశి
ఈ రోజు ఉల్లాసంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి కనపరుస్తారు. కుటుంబంలో ప్రోత్సాహకరంగా వుంటుంది. కొన్ని కార్యక్రమాలు మరింత మందకొడిగా సాగుతాయి. ఆర్ధిక లావాదేవీలు ఆశించిన స్థాయిలో వుంటాయి. వ్యాపార ,వాణిజ్యవేత్తలకు నూతన పెట్టుబడులు .ఉద్యోగులకు ఊహించని విధంగా మార్పులు. చిత్రపరిశ్రమ వారు ,క్రీడాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్ధులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు పఠించండి. శారీరక రుగ్మతలు కలుగుతాయి.
మిథునరాశి
కార్య్రమాలలో జాప్యం,ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. బంధువర్గంతో విరోధాలు.కొంత సొమ్ము అందినా ఖర్చులు తప్పవు. మిత్రులు వ్యతిరేకులుగా మారే అవకాశం. రాబడి నిరూత్సాహపరుస్తుంది. వ్యాపార ,వాణిజ్యవేత్తలకు వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మానసిక అశాంతి. ఆదిత్య హృదయం పఠించండి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.విందు వినోదాలలో పాల్గోంటారు.
కర్కాటక రాశి
కార్య్రమాలలో విజయం లభిస్తుంది. ఇంటిలో శుభకార్యాల చర్చలు జరుగుతాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా వుంటుంది. రుణాలు తీరుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సన్నిహితులు అన్నిటా సహకరిస్తారు. ఒక సంఘటన కొంత కలవర పెట్టవచ్చు. విద్యార్దుల అంచనాలు నిజమవుతాయి. విష్ణు సహస్ర నామ పారాయణం చేయండి. కొన్ని కార్యాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు. దైవారాధనలో పాల్గోంటారు.
సింహం రాశి
దీర్ఘ కాలిక రుణబాధలతో ఇబ్బంది పడుతారు.దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. సన్నిహితులతో అకారణంగా వివాదాలు. ఆర్ధిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఎంత కష్టించినా ఫలితం నామామాత్రమే వుంటుంది. పట్టుదలతో ముందుకు సాగి విజయాలు అందుకుంటారు. వ్యాపార ,వాణిజ్య వేత్తలకు నిరుత్సాహమే మిగులుతుంది. ఉద్యోగులకు అదనపు పనిభారం మీద పడవచ్చు. మహిళలకు మానసిక ప్రశాంతత.సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. ఆస్తి వివాదాల పరిష్కారం . వాహనాలు కొనుగోలు చేస్తారు.
కన్యా రాశి.
వ్యవహారాలు మందగిస్తాయి. అదనపు ఖర్చులు ఎదురవుతాయి. ఆలయ దర్శనాలు,ఉద్యోగుల ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. కొన్ని నిర్ణయాలు వాయిదా వేస్తారు. వ్యతిరేకులు కూడా మీకు సాహయం అందిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సామాన్య లభాలు అందుతాయి. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. దేవాయలయాలు సందర్శిస్తారు.
తుల రాశి
ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో ఆటంకాలు,ఆస్తి వివాదాలు చికాకు పెడుతాయి. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యసమస్యలు తప్పవు. మిత్రులు,కుటుంబ సభ్యులతో తగాదాలు. కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు.ఆదిత్య హృదయం పఠించండి.
వృశ్చిక రాశి
పనులలో ఆటంకాలు.ఇంటాబయటా సమస్యలు ,చికాకులు పరుస్తాయి. సన్నిహితులతో అకారణంగా తగాదాలు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గోంటారు. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు.ప్రత్యర్ధుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. వ్వాపారాలలో అంచనాలు తప్పుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు.పారిశ్రామిక,వైద్యరంగాల వారికి ఆటంకాలు.నరసింహ స్వామిని పూజించండి.
ధనస్సు రాశి
దూరప్రాంతాలనుండి శుభవార్తలు,ఆర్ధికంగా మరింత అభివృద్ధి వుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు అవకాశాలు దగ్గరగా వస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గోంటారు.వ్యాపార ,వాణిజ్య వేత్తలకు కొత్త పెట్టుబడులు అందుతాయి. అంగారక స్తోత్రాలు పఠించండి. నిరుద్యోగుల యత్నాలు నిదానిస్తాయి.
మకర రాశి
ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు చేపడుతారు. భూములు ,వాహనాలు కొంటారు. కార్యజయం.పలుకుబడి పెరుగుతుంది. వ్వాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి. పారిశ్రామిక ,వైద్యరంగాల వారికి విదేశీ పర్యటనలు. శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి.
కుంభ రాశి
మీ పై వచ్చిన ఆరోపణలు తొలగుతాయి. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆధరణ ప్రేమ పొందుతారు. చిరకాలంగా ఎదురవుతున్న సమస్యలు తీరుతాయి. వాహనాలు,స్థలాలు కొంటారు. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు. వ్వాపార ,వాణిజ్యవేత్తలకు ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగాలలో ఊహించని అభివృద్ధి జరుగుతుంది. చిత్రపరిశ్రమ వారికి క్రీడాకారులకు అంచనాలు నిజం కావచ్చు. విష్ణు సమస్రనామ పారాయణం చేయండి.
మీన రాశి
ఆర్ధిక ఇబ్బందులు వేదిస్తాయి. ఆలోచనలు నిలకడగా వుండవు. కుటుంబ ,ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతారు. కార్యక్రమాలలో ప్రతిబంధకాలు ఏర్పడుతాయి. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు ఏర్పడుతాయి. దేవాలయాలను సందర్శిస్తారు. ఉద్యోగాలలో వివాదాలు సర్ధుకుంటాయి. పారిశ్రామిక వేత్తలకు ,వైద్యులకు అవకాశాలు చేజారవచ్చు. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. ముఖ్య కార్యాలలో జాప్యం జరుగుతుంది. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. దైవారాధనలో పాల్గోంటారు.