ఈ రోజు రాశిఫలాలను చూస్తే మిశ్రమ ఫలితాలతో ఉత్సాహంగా వుంటారు.మే 22-2023, సోమవారం,రాశిఫలాలు
మేషరాశి
రాబడి తగ్గడం వలన రుణాలు చేయాల్సి వస్తుంది. మిత్రులతో అకారణంగా విభేదాలు.ఆలోచనలు కలిసిరావు. సోదరులతో భూ వివాదాలు నెలకొంటాయి. శ్రమ పడ్డా ఆశించిన ఫలితం కష్టమే. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. ఆరోగ్యం మందగిస్తుంది. ఔషద సేవనం,వ్యాపారాలు నిరూత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు,పారిశ్రామిక ,రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనల్లో ఆటంకాలు. కళాకారులకు ఒడిదుడుకులు.విద్యార్ధులు అందిన అవకాశాలు చేజారి నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబంలో చికాకులు.గణపతిని పూజించండి.
వృషభరాశి
ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు చేపడుతారు. భూములు ,వాహనాలు కొంటారు. కార్యజయం.పలుకుబడి పెరుగుతుంది. వ్వాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి. పారిశ్రామిక ,వైద్యరంగాల వారికి విదేశీ పర్యటనలు. శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి.
మిథునరాశి
పనులలో ఆటంకాలు.ఇంటాబయటా సమస్యలు ,చికాకులు పరుస్తాయి. సన్నిహితులతో అకారణంగా తగాదాలు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గోంటారు. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు.ప్రత్యర్ధుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. వ్వాపారాలలో అంచనాలు తప్పుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు.పారిశ్రామిక,వైద్యరంగాల వారికి ఆటంకాలు.నరసింహ స్వామిని పూజించండి.
కర్కాటక రాశి
దూరపు బంధువుల నుంచి శుభవార్తలు.ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా వుంటాయి. మీ అంచనాలు ఊహలు నిజం చేసుకుంటారు. అందరిలోనూ మంచి గుర్తింపు లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. శివస్తోత్రాలు పఠించండి.
సింహం రాశి
కొత్త పనులు చేపట్టి అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. అందరిలోనూ మీ సత్తా చాటుకుంటారు. ప్రత్యర్ధుల సైతం ఆకట్టుకుంటారు. ప్రతిభను ఇంటా బయట గుర్తిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారులు అనుకున్న విధంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉత్సాహంగా వుంటుంది. కళాకారులకు అంచనాలు నిజం అవుతాయి. శివపంచాక్షరి పఠించండి.
కన్యా రాశి.
బంధు మిత్రులతో విరోధాలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. గొంతు,చర్మ, సంబంధిత రుగ్మత సమస్యలు వేదిస్తాయి. ఆలోచనలు నిలకడగా వుండవు. ఇంటా బయటా గందరగోళం తప్పదు. దూరప్రయాణాలు వుంటాయి. కళాకారులకు కొంత అసంతృప్తి. వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి.
తుల రాశి
ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో ఆటంకాలు,ఆస్తి వివాదాలు చికాకు పెడుతాయి. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యసమస్యలు తప్పవు. మిత్రులు,కుటుంబ సభ్యులతో తగాదాలు. కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు.ఆదిత్య హృదయం పఠించండి.
వృశ్చిక రాశి
కొత్త కార్యక్రమాలకు శ్రీ కారం చుడుతారు. మీ సత్తా గురించి ప్రత్యర్ధులు సైతం ప్రశంసలు కురిపిస్తారు. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా వుంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. స్థలాలు ,వాహనాలు కొంటారు. కళాకారులకు నూతనోత్సాహం.విష్ణు సహస్ర పారాయణం చేయాలి.
ధనస్సు రాశి
బందువులతో వివాదాలు తీరి సఖ్యత నెలకొంటుంది. కుటుంబ సమస్యలు తొలుగుతాయి. ఒక ప్రకటన విశేషంగా ఆకట్టుకుంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. విద్యార్ధులు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు. హనుమాన్ చాలీసా పఠించండి..
మకర రాశి
పనులు ముందుకు సాగవు. రాబడి తగ్గి నిరాశాజనకంగా వుంటుంది. శ్రమ తప్ప పలితం వుండదు. బంధువుల వైకరి మనస్తాపం కలుగుతుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. బంధుగణంతో అకారణంగా తగాదాలు. ఆరోగ్యపరమైన చికాకులు తప్పవు. దుర్గాదేవిని పూజించండి.
కుంభ రాశి
పనులు విజయవంతంగా సాగుతాయి. నూతన ఉద్యోగయోగం. విలువైన ,వస్తువులు కొనుగోలు చేస్తారు. స్తిరాస్థి వివాదాలు.కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. శుభకార్యాల్లో పాల్గోంటారు. రాజకీయ సాంకేతిక రంగాల వారికి సానుకూలంగా వుంటుంది. కళాకారులకు అవార్డులు తథ్యం. శివాలయంలో మూడు ప్రదర్శనాలు చేయండి.
మీన రాశి
ఆర్ధిక ఇబ్బందులు అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం.నిర్ఱయాలలో మార్పులు వుండవచ్చు. కొన్ని వ్యవహారాలలో మార్పులు వుండవచ్చు. ఆరోగ్యం,వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఆలోచనలు స్థిరంగా వుండవు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గోంటారు. కళాకారులకు అవకాశాలు దూరమవుతాయి. గణపతిని పూజించండి.