కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్దిక వ్యవహారాలు సంతృప్తికరంగా వుంటాయి. సన్నిహితుల నుండి మాట సహాయం అందుతుంది. నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గోంటారు. కుటుంబ విషయాలలో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. దత్తాత్రేయ పూజలు చేయండి. అంతా మంచే జరుగుతుంది.
దీర్ఘ కాలిక సమస్యలు కొంత ఆందోళన కలిగిస్తాయి. ఆదాయం కంటే ఖర్చులు పెరగవచ్చు. కార్యక్రమాలలో కొన్ని ప్రతిబంధకాలు వుంటాయి. ఆరోగ్యం కొంత బాధిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగులకు స్థాన చలనం. మహిళలకు అశాంతి. గణపతికి అర్చన చేయించుకోండి.స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు.
ఒక ప్రణాళిక బద్ధంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్ధిక విషయాలు ఆశాజనకంగా వుంటాయి. సన్నిహితులతో వ్వక్తిగత విషయాలు చర్చిస్తారు. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. కొన్ని వివాదాలు కొంత చిరాకు పరుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపార ,వాణిజ్య వేత్తలు మరింత ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కీలక సమాచారం రావచ్చు. విష్ణు సహస్ర నామ పారాయణం చేయండి. కుటుంబంలో మరింత ఒత్తిడులు, శ్రమ మరింత పెరుగుతుంది.
ప్రముఖులతో పరిచయాలు.ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి.నూతన ఉద్యోగయత్నాలు ఫలించే సమయం. దూరపు బంధువులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. రాబడి మరింత పెరుగుతుంది. వ్యాపార , వాణిజ్య వేత్తలకు పెట్టుబడులలో కొత్త ఆశ. సత్యనారాయణ స్వామికి పూజలు చేయండి.
అనుకోని ప్రయాణాలు,ఖర్చులు పెరుగుతాయి. శ్రమాధిక్యంలో కొన్ని కార్యక్రమాలు చేస్తారు. స్వల్ప అనారోగ్యం, ఔషదసేవనం.బంధుమిత్రుల నుండి ఆరోపణలు ఎదురుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. కొన్ని సమస్యలను అధిగమిస్తారు. పట్టుదల పెరుగుతుంది. ఆర్దిక పరిస్థితి నిరాశాజనకంగా వుంటుంది. ఉద్యోగులకు ఊహించని స్థాన చలనం. నారసింహ స్తోత్రాలు పఠించండి.
ఇంటిలో పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఆదాయం అంతగా వుండదు. కోపతాపాలకు దూరంగా వుండండి. కొన్ని వ్యవహారాలలో కొన్ని ఆటంకాలు ఏర్పడుతాయి. ఆరోగ్యం కొంత సహకరించక కొంత ఇబ్బంది పడుతారు. వ్వాపార ,వాణిజ్య వేత్తలకు కొంత చికాకులు ఏర్పడుతాయి. అనుకున్న లాభాలు కష్టమే. రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.
కార్యక్రమాలలో విజయం లభిస్తుంది. ఇంటిలో శుభకార్యాల చర్చలు జరుగుతాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా వుంటుంది. రుణాలు తీరుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సన్నిహితులు అన్నిటా సహకరిస్తారు. ఒక సంఘటన కొంత కలవర పెట్టవచ్చు. విద్యార్దుల అంచనాలు నిజమవుతాయి. విష్ణు సహస్ర నామ పారాయణం చేయండి. కొన్ని కార్యాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు. దైవారాధనలో పాల్గోంటారు.
నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇంటా బయటా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తలు వింటారు.ధార్మిక కార్యక్రమాలలో పాల్గోంటారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ముందడుగు వేస్తారు. వ్వాపార ,వాణిజ్యవేత్తల లావాదేవీలు లాభాసాటిగా వుంటాయి. శివస్తోత్రాలు పఠించండి. అంత మంచే జరుగుతుంది.
కుటుంబంలో చికాకులు. చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి.ముఖ్య నిర్ణయాలలో ఆచితూచి అడుగు వేయండి. కాంట్రాక్టులు చేజారి నిరాశ చెందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో విబేధాలు కొంత వరకు తీరుతాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. కనకధారా స్తోత్రాలు పఠించండి. వ్వాపారాలు,ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ,సన్మానాలు జరుగుతాయి.
మీ పై వచ్చిన ఆరోపణలు తొలగుతాయి. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆధరణ ప్రేమ పొందుతారు. చిరకాలంగా ఎదురవుతున్న సమస్యలు తీరుతాయి. వాహనాలు,స్థలాలు కొంటారు. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు. వ్వాపార ,వాణిజ్యవేత్తలకు ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగాలలో ఊహించని అభివృద్ధి జరుగుతుంది. చిత్రపరిశ్రమ వారికి క్రీడాకారులకు అంచనాలు నిజం కావచ్చు. విష్ణు సమస్రనామ పారాయణం చేయండి.
వ్యవహారాలు మందగిస్తాయి. అదనపు ఖర్చులు ఎదురవుతాయి. ఆలయ దర్శనాలు,ఉద్యోగుల ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. కొన్ని నిర్ణయాలు వాయిదా వేస్తారు. వ్యతిరేకులు కూడా మీకు సాహయం అందిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సామాన్య లభాలు అందుతాయి. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. దేవాయలయాలు సందర్శిస్తారు.
ఆర్ధిక ఇబ్బందులు తప్పవు.రుణ యత్నాలు సాగుతాయి. ఇంటా బయటా ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన కార్యక్రమాలలో జాప్యం. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగులు ఓపికగ్గా వ్యవహరించాలి. శివాలయ దర్శనం మంచిది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు,కళాకారులకు చిక్కులు తప్పవు.