పిల్లలు కూడా హార్ట్ ఎటాక్ బారిన పడి మరణించడం కలచి వేస్తున్న విషయం.
Heart Attack: యాభై ఏళ్లు నిండిన వారికి మాత్రమే గుండె పోటు (Heart Attack) వస్తుందనే భావన ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పాతికేళ్లలోపు వయసున్న యువతకు (Youth) కూడా గుండె పోటు (Heart Problems) వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు విచిత్రంగా ఎనిమిదో తరగతి చదువుతున్న చిన్న పిల్లాడికి కూడా గుండె పోటు వచ్చి మరణించిన సంఘటన వెలుగుచూసింది. గ్రేటర్ నోయిడాలోని ఓ పాఠశాలలో రోహిత్ సింగ్ అనే పిల్లవాడు 8వ తరగతి చదువుతున్నాడు. అతను క్లాసులో కూర్చుని ఉండగా హఠాత్తుగా స్పృహ కోల్పోయాడు. ఉపాధ్యాయులు అతడిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చెక్ చేసి అప్పటికే అతను మరణించినట్టు చెప్పాడు. అతను గుండె పోటు కారణంగా మరణించినట్టు ప్రకటించారు వైద్యులు. పిల్లలకు కూడా గుండెపోటు రావడం తల్లిదండ్రులకు భయభ్రాంతులకు గురిచేస్తోంది.
ఎందుకిలా?
ఒకప్పుడు పెద్దవారికి మాత్రమే వచ్చే గుండెపోటు ఇప్పుడు పిల్లలకు కూడా రావడానికి ముఖ్యకారణం ఆధునిక జీవనశైలి అని చెబుతున్నారు ఆరోగ్యనిపుణఉలు. వారు తినే ఆహారం, కాలుష్యం, వ్యాయామం చేయకపోవడం లేదా అతిగా చేయడం వంటివి పిల్లలు, యువత గుండెపై ప్రభావం చూపిస్తోంది. మారుతున్న కాలంలో, గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువవుతున్నాయి. ధూమపానం, మద్యపానం, అధిక బరువు, మధుమేహం, రక్తపోటు వంటి వాటి వల్ల ఎక్కువగా గుండె పోటు వచ్చే అవకాశం పెరుగుతోంది. రక్తనాళాల్లో ఫలకాలు లేదా కొవ్వు పేరుకుపోయి, గుండెకు రక్తం సరఫరాల కాక గుండె పోటు వచ్చి మరణాలు సంభవిస్తున్నాయి. కానీ పిల్లల్లో కూడా ఇలా జరగడం బాధిస్తున్న అంశం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా యువ తరంలో 17.9 మిలియన్ల మంది గుండె సంబంధ వ్యాధుల వల్ల మరణిస్తున్నట్టు తేలింది. ఆ సంఖ్యలో ఐదో వంతు మరణాలు మనదేశంలోనే సంభవిస్తున్నాయి.
1. పౌష్టికమైన తాజా ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోవాలి.
2. ఉప్పు తీసుకోవడం తగ్గించాలి.
3. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి.
4. ధూమపానం చేయకూడదు.
5. మీరు డయాబెటిస్తో బాధపడుతుంటే మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవాలి.