వేసవిలో డయాబెటిస్తో బాధపడుతున్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Diabetes: వేసవిలో (Summer) పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అధిక రక్తపోటు (High BP), డయాబెటిస్ (Diabetes) వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పుడు తినే పదార్థాలను మెరుగ్గా ఎంచుకోవాలి. డయాబెటిస్తో బాధపడుతున్న వారు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అధికం చేస్తాయి. శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచుతాయి. అందుకే మధుమేహ రోగులు కొన్ని రకాల పదార్థాలకు దూరంగా ఉండాలి.
గోధుమ రవ్వ
చాలామందికి తెలియని విషయం ఏమిటంటే గోధుమ రవ్వను కూడా డయాబెటిస్ రోగులు దూరం పెట్టాలి. కానీ దీంతో ఉప్మా చేసుకొని తినేస్తుంటారు. గోధుమలను ప్రాసెస్ చేయడం వల్ల గోధుమ రవ్వను తయారుచేస్తారు. ప్రాసెస్ చేసిన ఆహారాలు డయాబెటిస్ రోగులకు మంచిది కాదు.
మైదా
జీవితాంతం మధుమేహరోగులు దూరం పెట్టాల్సిన పిండి మైదా. దీనిలో గ్లూటెన్ అధికంగా ఉంటుంది. మైదాతో చేసిన ఆహారాలు ఏవి తిన్నా కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. కాబట్టి వేసవిలోనే కాదు ఎప్పుడైనా కూడా మైదా తినకూడదు.
బేకరీ ఉత్పత్తులు
సాయంత్రమైతే చాలు చిరుతిండి కోసం చేతులు వెతికేస్తాయి. బేకరీలకు ఎక్కువ మంది వెళ్లి బిస్కెట్లు, నమ్కీన్స్ వంటివి కొనుక్కుని తింటారు. వాటిని కూడా మైదాతోనే తయారు చేస్తారు. కాబట్టి అలాంటివి తినకపోవడమే మంచిది. చక్కగా పండ్లు తిని కడుపు నింపుకోవడం ఉత్తమం.
బంగాళాదుంపలు
బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. స్టార్చ్ కూడా ఉంటుంది. అలాగే చిలగడ దుంపలను కూడా డయాటిస్ రోగులు దూరం పెట్టాలి.
వేపుళ్ళు
నూనెలో వేయించిన ఆహారాలను తినడం మంచిది కాదు. వీటిలో అధిక కొలెస్ట్రాల్ ఉంటుంది. అలాగే ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. మీకు తెలియకుండానే బరువు పెరిగిపోతారు. బరువు పెరగడం మధుమేహానికి మంచిది కాదు.
ఐస్ క్రీమ్
మండే ఎండల్లో ఐస్ క్రీమ్ కనబడగానే ఎగబడి తినే వాళ్ళు ఎంతోమంది. కానీ ఐస్ క్రీమ్ లో చక్కెర అధికంగా ఉంటుంది. దీన్ని తినడం శరీరంలో చేరే క్యాలరీలు కూడా ఎక్కువే. ఐస్ క్రీమ్ తిన్నా వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోతాయి. దీనివల్ల డయాబెటిస్ మరింతగా పెరుగుతుంది.
కూల్ డ్రింకులు
ఎండలు ఎంతగా మండిపోతున్న కూల్ డ్రింకుల జోలికి మాత్రం పోకూడదు. వీటివల్ల శరీరం మరింతగా డిహైడ్రేషన్ బారిన పడుతుంది. వాటికి బదులు కోల్డ్ కాఫీ, మజ్జిగ, చల్లని స్మూతీలు, నిమ్మరసం వంటివి తాగితే చాలా ఉత్తమం. కూల్ డ్రింకులు తాగడం వల్ల డయాబెటిస్ సమస్య పెరుగుతుంది.