ఆరోగ్యం బావుండాలంటే కొన్ని రకాల పదార్ధాలను రాత్రి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
Good Sleep: ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారంతో పాటూ చక్కటి నిద్ర (Good Sleep) కూడా అవసరం. అప్పుడే శరీరంలోని అవయవాలన్నీ (Body Parts) సక్రమంగా పనిచేస్తాయి. కానీ చక్కటి నిద్ర ఎంత మందికి సొంతమవుతోంది? చంటి పిల్లల్లా (Kids) హాయిగా, ప్రపంచాన్ని మరిచిపోయి నిద్రించే (Deep Sleep) వారి సంఖ్యా చాలా తక్కువ. ఎంత మత్తుగా నిద్ర పడితే ఆరోగ్యానికి అంత మంచిది. రోజు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతే చాలు, శరీరానికి బోలెడంత సత్తువ వస్తుంది. సరిగా నిద్ర పట్టడం లేదంటే ఆహారం సరైనది తీసుకోవడం లేదని అర్థం చేసుకోవాలి. ఒత్తిడి వల్ల కూడా కొందరిలో నిద్ర పట్టదు. ఒత్తిడిని దూరం పెట్టి, కొన్ని రకాల ఆహారాలు తినడం ద్వారా నిద్రపట్టేలా చేయవచ్చు.
నిద్ర చక్కగా పట్టాలంటే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి శరీరానికి కూడా చాలా అత్యవసరమైనవి. నిద్ర బాగా పట్టేందుకు ఇవి సహకరిస్తాయి. ఈ కొవ్వు ఆమ్లాల్లో ఈకోసాపెంటయినోయిక్, డోకోసాహెక్టాయినోయిక్ యాసిడ్ అనే రెండు రకాలున్నాయి. ఇది రెండూ కూడా చేపల నుంచి లభిస్తాయి. అలాగే శాకాహారంలో ఉండే ఫ్యాటీ ఆమ్లం ‘ఆల్ఫా లినోలిక్ ఆమ్లం’. ఇవన్నీ హర్మోన్లో తయారీలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇవన్నీ శరీరానికి కావాల్సిన అత్యవసర ఆమ్లాలు, శరీరం వీటిని తయారుచేసుకోలేదు. కాబట్టి ఆహారం ద్వారానే వీటిని తినాలి. చేపలు, వాల్ నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్ వంటివాటిల్లో ఇది అధికంగా ఉంటాయి. ఈ ఒమేగా కొవ్వులు గాఢనిద్రకు సహకరిస్తాయి. రెండు వారాల పాటూ రోజూ వీటిని తింటే మీకు నిద్ర
నిద్ర పట్టడానికి మెలటోనిన్ అనే హర్మోను అవసరం. దీన్ని తయారుచేయాలంటే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కావాలి. పైన చెప్పిన ఆహారాలన్నీ తింటే మెలటోనిన్ హార్మోను అధికంగా ఉత్పత్తి అయి నిద్రపట్టేందుకు సహకరిస్తుంది. నిద్ర గాఢంగా పట్టడం వల్ల శరీరం తగినంత విశ్రాంతి తీసుకుంటుంది. దెబ్బతిన్న కణాలు రీపేర్ వర్క్ కూడా శరీరంలో సవ్యంగా జరుగుతుంది. చేప నూనెల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. కాబట్టి కొవ్వు పట్టిన చేపలను తెచ్చి వండుకోవడం ఉత్తమం. ఎన్నో అధ్యయనాల్లో కూడా ఈ విషయం బయటపడింది. కాబట్టి నిద్రా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం అలవాటు చేసుకోవాలి.