నెయిల్ పాలిష్ అంటే ఇష్టపడే వారికి ఇది షాక్ ఇచ్చే కథనమే.
Nail polish: పొడవాటి గోళ్ళపై (Nails) నచ్చిన రంగు నెయిల్ పాలిష్ (Nail Polish) వేసుకుని ఫ్యాషన్ (Fashion) ఐకాన్లలా తయారవుతున్నారా? కానీ జాగ్రత్త మీరు వాడే నెయిల్ పాలిష్లో ఉండే రసాయనాలు మీకు ప్రాణాంతకమైన అలెర్జీని (Deadly Allergy) కలిగించే అవకాశం ఉంది. ఓ మహిళ అలా నెయిల్ పాలిష్ లో ఉన్న రసాయనం కారణంగా చేతి వేళ్ళు, చేతులకు కూడా అలెర్జీ వచ్చేలా చేసుకుంది. దీనివల్ల ఆమె కొన్ని రోజులపాటు చేతివేళ్ళను కదపలేకపోయింది. దాన్ని అలా వదిలేస్తే ఆ ఇన్ఫెక్షన్ శరీరంలోని ప్రధాన అవయవాలకు కూడా సోకే ప్రమాదం ఉంది. చివరకి ప్రాణాంతకంగా మారుతుంది. అసలు ఏమైందంటే ఓ మహిళ నెయిల్ పాలిష్ వేసుకున్నాక, ఆమెకు గోళ్లు విపరీతంగా నొప్పి పెట్టాయి. గోళ్ల దగ్గర చర్మం చిన్న చిన్న ముక్కలుగా రాలిపోవడం మొదలైంది. అయినా ఆమె పట్టించుకోలేదు. రెండు రోజులు తర్వాత వేళ్లు కదపలేనంత నొప్పితో బాధపడింది. వైద్యుల వద్దకు వెళ్లగా వాళ్ళు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఇలా అయిందని తేల్చారు. యాంటీబయోటిక్స్ తో చికిత్స అందించారు. ఇన్ఫెక్షన్ కూడా నయమైంది. ఆమె మళ్లీ మెయిల్ పాలిష్ వేసుకుంది. నెయిల్ పాలిష్ వేసిన కొన్ని గంటల తర్వాత తిరిగి నొప్పి మొదలైంది. చర్మం పొలుసుల్లా రాలిపోవడం వంటి లక్షణాలు కనిపించాయి. దీన్ని బట్టి ఆమెకు నెయిల్ పాలిష్ లో ఉన్న రసాయనాల వల్ల ఇన్ఫెక్షన్ సోకినట్టు నిర్ధారించారు వైద్యులు. ఆమె వాడిన జెల్ నెయిల్ పాలిష్ లో హానికరమైన రసాయనాలు ఉన్నాయని, ఇక ఎప్పుడూ నెయిల్ పాలిష్ వేసుకోవద్దని ఆమెకు సూచించారు.
ఇది కేవలం ఆ మహిళ కోసమే కాదు నెయిల్ పాలిష్ వేసుకునే అందరి మహిళలు జాగ్రత్త పడాలి. నెయిల్ పాలిష్లలో మెథక్రిలేట్లు అనే రసాయనాలు ఉంటాయి. ఇవి చర్మం లోనికి ప్రవేశించాయంటే చాలా ప్రమాదకరం. గోళ్ళని పెళుసుగా మార్చి విరిగిపోయేలా చేస్తాయి. నొప్పి విపరీతంగా వచ్చేలా చేస్తాయి. ఈ రసాయనం లేని నెయిల్ పాలిష్లను వాడడమే మంచిది. కానీ నెయిల్ పాలిష్లలో ఈ రసాయనం ఉందో లేదో తెలుసుకోవడం కష్టం. కాబట్టి గోళ్ల రంగులను వాడడం మానేయాలి, లేదా ఒక గోరుకు వేసుకున్నాక రెండు రోజులు పరీక్షించాలి. ఎలాంటి రియాక్షన్ కనిపించకపోతే అప్పుడు ఆ నెయిల్ పాలిష్ ను వాడాలి. అలాగే ఇది వేసుకునే ముందు SPF 30 అనే సన్ స్క్రీన్ లోషన్ కూడా రాస్తే నెయిల్ పాలిష్ చర్మంలోకి లోపలికి వెళ్ళకుండా ఇది అడ్డుకుంటుంది.
ఈ గోళ్ల రంగులలో ట్రైఫెనెల్ ఫాస్పేట్ అనే రసాయనం ఉంటుంది. ఇది కూడా చాలా ప్రమాదకరమైంది. ఇది శరీరంలో చేరితే నేరుగా హార్మోన్లపై ప్రభావం చూపించి ఎన్నో సమస్యలను దారితీస్తుంది. కాబట్టి నెయిల్ పాలిష్ వేసుకునే ముందు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారు నెయిల్ పాలిష్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. అలాగే కుడి చేతికి ఈ రంగును వేసుకోవద్దు, ఇది ఆహారం ద్వారా పొట్టలో చేరే అవకాశం ఉంది.