ఓ వ్యక్తి తుమ్మడం వలన ఆసుపత్రి పాలయ్యాడు. వింతగా ఉన్నా ఇది నిజం.
Brain And Sneeze: తుమ్ములు (Sneeze) రావడం అనేది అందరికీ జరిగేదే. ముక్కులో (Nose) ఏదైనా అడ్డు తగిలినప్పుడు, లేదా శ్వాస గొట్టంలో ఏదైనా దుమ్ము (Dust) చేరినప్పుడు…. ఆ దుమ్మును బయటికి పంపించేందుకు శరీరం ప్రతిచర్యగా తుమ్ముని (Sneeze) ఇస్తుంది. తుమ్మినప్పుడు ఆ అడ్డు తగిలిన దుమ్ము ధూళి బయటకు పోతాయి. అలాగే అమెరికాలోని ఒక యువకుడికి తుమ్ము వచ్చింది. తుమ్మిన తర్వాత కొంత సేపటి వరకు ఆయనకి స్పృహ లేదు. స్పృహ వచ్చాక చూసుకుంటే చుట్టూ రక్తమే ఉంది. ముక్కు నుండి రక్తం రాసాగింది. వెంటనే తన బంధువులకు ఫోన్ చేసి రమ్మని పిలిచాడు. వారు అతని పరిస్థితిని చూసి వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేశారు. వైద్యులు అతనికి ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం స్కానింగ్లు, పరీక్షలు చేశారు. దానిలో వారికి తేలింది ఏమిటంటే… తుమ్మడం వల్ల అతని మెదడులోని నరాలు చిట్లిపోయాయి. ఇలా చిట్లి పోవడానికి కారణం అతనికున్న ఒక అరుదైన వ్యాధి.
ఆ యువకుడ పరిస్థితి చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు. అతనికి అత్యవసర చికిత్స చేసి బతికించారు. వైద్యులు అతనికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా వివరించారు. మెదడులో ధమనులు, సిరలను కలిపే సూక్ష్మ రక్తనాళాలు ఉంటాయి. ఈ సూక్ష్మ రక్తనాళాలు తమ దారిలో తాము పోకుండా అన్నీ కలిపి చిక్కులు పడతాయి. జుట్టు ఎలా చిక్కులు పడుతుందో అలా. ఇలా చిక్కు
లు పడడం వల్ల తుమ్మినప్పుడు అవి చిట్లిపోయే అవకాశం ఉంది. ఈ సమస్యనే ఆర్టరియోవెనస్ మాల్ఫార్మేషన్ అంటా.రు ఇది చాలా అరుదుగా వచ్చే వ్యాధి. ప్రపంచ జనాభాలో కేవలం ఒక శాతం మందికే ఇది వచ్చే అవకాశం ఉంది. తుమ్మినప్పుడు చిక్కు పడిపోయిన ఆ రక్తనాళాలు చిట్లిపోయి అంతర్గతంగా రక్తస్రావం అవుతుంది. అలాగే ముక్కు నుండి కూడా రక్తం వస్తుంది. వెంటనే చికిత్స అందించకపోతే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది
కేవలం ఒక శాతం మంది జనాభాలే వేధిస్తున్న సమస్యను షార్ట్ కట్లో AVM అంటారు. శరీరంలోని ఏ ప్రాంతంలోనైనా సూక్ష్మ నాళాలు చిక్కుబడిపోవచ్చు. అప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కండరాలు బలహీనంగా మారడం, పక్షవాతం రావడం, వికారం, వాంతులు, తిమ్మిరి పట్టినట్టు అవ్వడం, వణుకుతున్నట్టు అనిపించడం, తల తిరగడం, మాట్లాడడంలో ఇబ్బంది, మానసికంగా గందరగోళంగా అనిపించడం, చిత్తవైకల్యం రావడం, తలనొప్పి రావడం, స్పృహ కోల్పోవడం… ఇవన్నీ కూడా ఆ సమస్య లక్షణాలు. ఎమ్మారై స్కాన్ ద్వారా ఈ సమస్యను నిర్ధారిస్తారు.