భార్యాభర్తల మధ్య వాదనలు జరగడం, గొడవలు రావడం సహజం.
Wife and Husband: దంపతులు (Wife and Husband) మధ్య చిన్న చిన్న విషయాలకి చర్చలు జరగడం, ఆ చర్చలు గొడవలకు (Quarrel) దారి తీయడం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఒకరిపై ఒకరు అరుచుకున్నాక (Shouting) మానసిక ప్రశాంతత (Mental Peace) చెడిపోతుంది. ఆ సమస్య (Problem) లేదా గొడవ పెద్దది కాకుండా సద్దుమణగాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ఆ ఒత్తిడి (Stress) వాతావరణం నుంచి బయట పడాలి. కొన్ని చిట్కాలను పాటిస్తే గొడవ సద్దుమణిగి భార్యాభర్తల మధ్య బంధం బలహీనంగా మారకుండా బలపడుతుంది.
గొడవ జరిగాక మనసు భారంగా మారిపోతుంది. దాని ప్రభావం మీ మీద పడకుండా ఉండాలంటే మీ సన్నిహితులతో కాసేపు మాట్లాడండి. గొడవ జరిగిన విషయాన్ని చెప్పండి. మీ ఆలోచనలను, ఉద్వేగాలను షేర్ చేసుకోండి. ఇది మనసులోని భారాన్ని దించేస్తాయి. ఒత్తిడి వాతావరణం నుంచి మీరు బయటపడతారు. తర్వాత మీ భాగస్వామితో మాట్లాడినా కూడా మీకు ఎలాంటి కోపము రాదు. గొడవ జరిగే అవకాశం కూడా ఉండదు.
భర్తతోనో లేక భార్యతోను గొడవ జరిగినప్పుడు తీవ్రంగా మనస్థాపం చెందే అవకాశం ఉంది. అలాంటప్పుడు మీ భావోద్వేగాలను దాచుకోవద్దు. డైరీలోనో లేక ఒక కాగితం పైనో రాసి పెట్టేయండి. అది పెద్ద విషయమైనా, చిన్న విషయమైనా మీపై ప్రభావం ఎక్కువ చూపిస్తుంటే ఆ భారాన్ని మోయకూడదు. వెంటనే మీ కోపానికి, ఉద్వేగాలకు అక్షర రూపం ఇవ్వండి. దాన్ని మళ్లీ మీరే చదవండి. మీపై ఉన్న మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మీ భర్త లేదా భార్యతో మళ్లీ మాట్లాడాలనిపిస్తుంది.
గొడవ జరిగాక ఇంకా అతని ముందే లేదా ఆమె ముందే తిరగడం వల్ల మళ్ళీ వాదన జరిగే అవకాశం ఉంది. కాబట్టి బెడ్ రూమ్ లోకి వెళ్లి నిద్రపోవడానికి ట్రై చేయండి. నిద్రపోవడం వల్ల మనసులోని ఆందోళన పోతుంది. నిద్ర రావడం లేదు అనిపిస్తే ఒక మంచి పుస్తకం తీసి చదవండి. ఖచ్చితంగా నిద్ర వస్తుంది, లేదా వ్యాయామం చేయండి. ఇవి నిద్రను వచ్చేలా చేస్తాయి. మనసు శరీరం రెండు తేలిక అయితే మెదడు కూడా ఫ్రెష్ గా మారుతుంది. అప్పుడు మళ్లీ కొత్తగా మీ జీవిత భాగస్వామితో మాట్లాడడం ప్రారంభించండి.