నెత్తి మీద జుట్టు వున్నప్పుడే కాదు నెత్తి మీద కత్తెర పడినప్పుడు కూడా జట్టు విలువైనది అంటారు( Hair experiment ) భారతీయ శాస్త్రవేత్తలు
నెత్తి మీద జుట్టు వున్నప్పుడే కాదు నెత్తి మీద కత్తెర పడినప్పుడు కూడా జట్టు విలువైనది అంటారు( Hair experiment ) భారతీయ శాస్త్రవేత్తలు. జుట్టు అనేక రకాల ప్రోటీనులతో రూపొందుతుంది. దీని నిర్మాణంలో కెరాటీన్ (caratin)అనేది ప్రోటీన్ కీలక పాత్ర వహిస్తుంది. జుట్టుకి రంగు నిచ్చేది మెలనిన్. ఈ రెండిటిని సేకరిస్తే జీవ ఔషదాల తయారిలో ఉపయోగపడుతాయి. కాని వీటి సేకరణ చాలా కష్టం అంటారు.
కోల్ కత్తాలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్స్ స్ కు చెందిన ప్రోఫెసర్ పౌలమి ఘోష్, ఆమె తోటి ఉద్యోగులు దీనికి సులభ విదానాన్ని కనుగోన్నారు. సెలూన్ల నుంచి సేకరించిన జుట్టును(Hair ) సేకరించి శుభ్రపరిచి చిన్న ముక్కలుగా కత్తిరించారు. ఆ పైన దాన్ని ఒక అయాన్ ద్రావణంలో కలిపారు. తద్వారా కెరాటిన్ ప్రోటీన్లు కలిపి వుంచితే హైడ్రోజన్ బంధాల్ని విడగొట్టగలిగారు. ఆపైన మిశ్రమాన్ని వేడిచేసి హైడ్రోక్లోరిక్ యాసిడ్ లోకి పంపినప్పుడు మెలనిన్ పిగ్మంట్ ఘనరూపంలో వేరుపడింది. ఆపైన డయాలసిస్ చేసి కెరాటిన్ ను సేకరించారు. ఇలా సేకరించిన కెరాటిన్ ను హెమాస్టాటిక్ బ్యాండేజీల్లో
మెలనిన్ ని యూవీ కిరణాల నుండి సంరక్షించే ఉత్పత్తుల్లో వాడొచ్చట.
జుట్టు అందంగా ఉండాలని కోరుకోనివారు ఎవరుంటారు చెప్పండి..? అందరూ తమ జట్టు ఒత్తుగా.. అందంగా ఉండాలని.., రాలిపోకూడదని కోరుకుంటారు. అందుకోసం మనం చేయని ప్రయత్నమంటూ ఉండదు. కానీ.. మన లైఫ్ స్టైల్, కాలుష్యం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి పలు కారణాల వల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. అలాంటివారు.. కొన్ని పోషకాలను తీసుకోగలిగితే… జుట్టు అందంగా, ఒత్తుగా పెరుగుతుందట.