ఈ ఆకులు ఎక్కడ కనిపించినా ఇంటికి తెచ్చుకోండి. ఇవి ఎంతో ఉపయోగకరమైనవి.
ప్రపంచంలో ఎక్కువ శాతం మంది డయాబెటిస్, అధిక రక్తపోటు సమస్యలతోనే ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ అనేది ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేకపోతే వచ్చేదే డయాబెటిస్. అందుకే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్‌ను ఎప్పటికప్పుడు చూసుకోవాలి. అవి అదుపులో ఉండేలా ఆహారాన్ని నియంత్రించుకోవాలి. వ్యాయామాలు చేయాలి. ఇది అదుపులో లేకపోతే శరీరంలోని ప్రధాన అవయవాలైన గుండె, మూత్రపిండాలు దెబ్బతింటాయి.
డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుకోవడమే తప్ప పూర్తిగా నయం చేయడం జరగదు. ఆయుర్వేదంలో డయాబెటిస్‌కు అద్భుతమైన ఔషధంగా బ్రహ్మీ ఆకులను చెబుతారు. గుండ్రంగా ఉండే ఈ ఆకులు చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. కానీ వాటిలో గొప్పతనం గుర్తించేవారు తక్కువ. ఈ ఆకులతో తయారు చేసిన టీ ని తాగడం లేదా ఈ ఆకులను తినడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది. ఈ ఆకులను తినలేని వాళ్ళు వాటిని మాత్రలు, సిరప్, పొడి రూపంలో కొనుక్కోవాలి. ఆయుర్వేద మందుల షాపుల్లో కూడా బ్రహ్మీ ఆకులతో చేసిన పొడి, సిరప్ లు, ట్యాబ్లెట్లు అమ్ముతున్నారు. వాటిని కొని తినడం మంచిది. అయితే ఆయుర్వేద వైద్యులను కలిసి వాటిని ఎంత మోతాదులో వేసుకోవాలో సలహా తీసుకోవాలి.
బ్రహ్మీనీ బకోపా మొన్నీరి అంటారు. వీటిలో ఆరోగ్య ప్రయోజనాలు అధికం. ఇది ఒక మ్యాజిక్ మూలికగా చెప్పుకోవచ్చు. నీటి అడుగున పెరిగే ఈ మొక్క అక్వేరియంలో ఎక్కువగా వినియోగిస్తారు. ఇది ఒక ఔషధం మూలిక. టైప్1, టైప్2 మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ ఔషధంతో తయారుచేసిన మందులను తీసుకుంటే మంచిది. ఈ ఆకుల్లో యాంటీ హైపర్ గ్లైసిమిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి చక్కెర స్థాయిలను రక్తంలో అదుపులో ఉంచుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పాటు, టాక్సిన్లను బయటకు పంపిస్తాయి. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు వంటి ముఖ్యమైన అవయవాలకు రక్షణ కల్పిస్తాయి. ఈ బ్రహ్మీ ఆకుల వల్ల జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. మూర్ఛా వంటివి తగ్గుతాయి. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఒత్తిడి వంటివి తగ్గుతాయి. కాబట్టి సాధారణ వ్యక్తులు కూడా బ్రహ్మిని ఔషధంగా తీసుకోవచ్చు.