Writer Padmabhshan Trailer: కలర్ ఫోటో హీరో ఇంకో హిట్ కొట్టేలా ఉన్నాడే
Writer Padmabhshan Trailer Out: కలర్ ఫొటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుహాస్. ఈ సినిమా జాతీయ అవార్డును కూడా అందుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత నటుడిగా.. మంచి పాత్రలలో నటిస్తూ మెప్పిస్తున్నాడు. ఇక ప్రస్తుతం సుహాస్ హీరోగా నటిస్తున్న చిత్రం రైటర్ పద్మభూషణ్. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సుహాస్ సరసన టీనా శిల్పరాజ్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ట్రైలర్ ను బట్టి కామెడీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది.
ఒక మధ్యతరగతి కుటుంబం.. తల్లి తండ్రి కొడుకు.. కొడుకుకు రచయిత కావాలని పెద్ద కోరిక. అతడు ఒక బుక్ రాసి దాన్ని సేల్ చేయాలనీ తాపత్రయపడతాడు. కానీ, ఆ బుక్ ఎవరికి నచ్చదు. అయితే ఆ బుక్ నచ్చిన ఒకే ఒక అమ్మాయి హీరోయిన్. అతడితో ఆమె ప్రేమలో పడుతోంది. ఆ క్రమంలో ఆయన యొక్క కుటుంబ పరిస్థితులు అతడి యొక్క కలకు ఎలా అడ్డం పడ్డాయి.. అదే సమయంలో హీరో యొక్క ప్రేమ కథలో వచ్చే ట్విస్ట్ లతో కథ సాగుతుంది. మరి చివరికి రైటర్ పద్మభూషణ్ చివరికి తన బుక్ ను అమ్మాడా..? పేరు తెచ్చుకున్నాడా..? అనేది కథగా తెలుస్తోంది. ఇక సుహాస్ నటన మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. వినోదాన్ని పంచడంతో పాటు చాలా ఆసక్తికరంగా స్క్రీన్ ప్లే సాగినట్లుగా ట్రైలర్ తో మేకర్స్ చెప్పకనే చెప్పారు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సుహాస్.. మరో హిట్ ను అందుకుంటాడో లేదో చూడాలి.