Pushpa 2: ‘పుష్ప 2’ లో శ్రీవల్లీ చనిపోతుందా.. నిర్మాత ఏమన్నారంటే..?
Will Srivalli Character Die In Pushpa-2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చిత్రం ‘పుష్ప’. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా విడుదలైన ప్రతి భాషలో కాసుల వర్షం కురిపించింది. ముఖ్యంగా హిందీ లో తెలుగు సత్తాను చూపించిన సినిమా.. ఇక దీంతో పుష్ప పార్ట్ 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా గురించిన ఒక వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. పుష్ప 2 లో శ్రీవల్లీ పాత్ర చనిపోతుందని, బన్నీపై పగ తీర్చుకోవడం కోసం విలన్లు రష్మికను చంపుతారని టాక్ నడుస్తుంది. దీంతో ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉండే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. ఇక తాజాగా ఈ వార్తలపై ఈ సినిమా నిర్మాత రవి శంకర్ స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ వార్తలను ఖండించారు. “శ్రీవల్లీ చనిపోతుంది అని వస్తున్న వార్తల్లో నిజం లేదు.
ఇప్పటివరకు పూర్తి కథను ఎవరు వినలేదు. ఎవరో ఏదో కథ ఇలా ఉంటే ఎలా ఉంటుంది అని ఉహించుకొని వార్తలు రాసేస్తారు. దాని గురించి ఎవరికీ ఏమీ తెలియదు, కాబట్టి వారు దానిని నమ్ముతారు. ఇది ఇతర వెబ్‌సైట్‌లు మరియు టీవీ ఛానెల్‌లు కూడా వెళ్లి వైరల్ గా మారుతున్నాయి. అంతే తప్ప ఇందులో నిజం లేదు” అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ రూమర్స్ కు చెక్ పడినట్లు అయ్యింది.