యంగ్ హీరో మంచు మనోజ్ ఇండస్ట్రీకి దూరమై చాలారోజులు అయ్యింది. మనోజ్ వ్యక్తిగత జీవితంలో అనుకోని సంఘటనలు జరగడంతో ఆయన కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు.
యంగ్ హీరో మంచు మనోజ్ ఇండస్ట్రీకి దూరమై చాలారోజులు అయ్యింది. మనోజ్ వ్యక్తిగత జీవితంలో అనుకోని సంఘటనలు జరగడంతో ఆయన కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇక కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన మనోజ్, ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన హీరోగా ‘వాట్ ద ఫిష్’ సినిమా రూపొందుతోంది. ‘వాట్ ది ఫిష్’ పేరుతో తన కొత్త ప్రాజెక్ట్ గతంలోనే ప్రకటించారు. ఈ చిత్రానికి వరుణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 6ix సినిమాస్ బ్యానర్ పై విశాల్ బెజవాడ – సూర్య బెజవాడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక నేడు మంచు మనోజ్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేసి మనోజ్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.
ఫస్ట్ గ్లింప్స్ వీడియో ఆద్యంతం ఆకట్టుకోవడమే కాకుండా ఆసక్తిని కూడా కలిగిస్తుంది. మొదటి నుంచి ఈ సినిమా టైటిల్ తోనే ఆసక్తి కలిగించిన మేకర్స్ కాన్సెప్ట్ వీడియోతో మెప్పించారు. రెండు విభిన్నమైన స్వభావాలు కలిగిన ఒక వ్యక్తిగా ఈ గ్లింప్స్ లో మనోజ్ కనిపిస్తున్నాడు. డార్క్ కామెడీ, హై-ఆక్టేన్ థ్రిల్లింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు వీడియో చూస్తే తెలుస్తోంది. ఒకపక్క రోబోలా కనిపిస్తుంటే.. ఇంకోపక్క మనిషిలా కనిపిస్తున్నాడు. ఇక భయపెడతాను అన్నట్లు వెనుక వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ క్రేజీగా ఉంది. ఈ ఫస్ట్ గ్లింప్స్ ను బట్టి మనోజ్ మరో కొత్త ప్రయోగానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు. మరి ఈ సినిమాతోనైనా మనోజ్ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.